Credit Cards | ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం విరివిగా పెరిగింది. బ్యాంకులు సైతం ఎక్కువ సంఖ్యలోనే కార్డులను జారీ చేస్తున్నాయి. ఒక వ్యక్తి దగ్గర ఒకటి, రెండు కన్నా ఎక్కువ సంఖ్యలోనే క్రెడిట్కార్డులున్నాయి. అయితే, క్రెడిట్‌కార్డుల తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతు ఇబ్బందులుపడే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.
Credit Cards | ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం విరివిగా పెరిగింది. బ్యాంకులు సైతం ఎక్కువ సంఖ్యలోనే కార్డులను జారీ చేస్తున్నాయి. ఒక వ్యక్తి దగ్గర ఒకటి, రెండు కన్నా ఎక్కువ సంఖ్యలోనే క్రెడిట్కార్డులున్నాయి. అయితే, క్రెడిట్‌కార్డుల తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతు ఇబ్బందులుపడే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. చాలామంది క్రెడిట్‌కార్డుల ద్వారానే పేమెంట్స్ చేస్తుంటారు. క్రెడిట్‌కార్డులతో కొనుగోలు చేసిన సమయంలో బ్యాంకులు రివార్డు పాయింట్స్ సైతం ఇస్తుంటాయి.
డైనింగ్, ట్రావెల్, కిరాణ దుకాణం, ఇంధనం తదితర నిర్దిష్టంగా రివార్డులు ప్రయోజనాలు అందుతాయి. ఎక్కువగా కార్డులను వినియోగిస్తే మరి రివార్డులు ఎక్కువగా వస్తాయా? లేదా? అనే విషయంపై అవగాహన ఉండాలి. అలాగే కార్డుల బిల్లులను నిర్దిష్ట సమయంలోనే చెల్లించాల్సిందే. లేకపోతే పెనాల్టీలు భారీగా విధించే అవకాశాలుంటాయి. వార్షిక ఫీజు చెల్లించడాన్ని సమర్థించేందుకు యూజింగ్ ఫ్రీక్వెన్సీని.. ఇతర ప్రయోజనాలకు సంబంధించిన విలువను పరిగణించాలి. తప్పనిసరిగా కార్డు యాన్యువల్ ఫీజు తక్కువగా ఉండే కార్డులను మాత్రమే ఎంచుకోవాలి.
చాలామంది క్రెడిట్‌కార్డులను తీసుకునే సమయంలో వడ్డీ రేట్లపై దృష్టి పెట్టరు. రివార్డులు, క్యాష్బ్యాష్ తదితర ప్రయోజనాలపై మాత్రమే దృష్టి ఉంటుంది. అయితే, తప్పనిసరిగా వడ్డీ రేటుపై దృష్టి సారించాలని.. లేకపోతే వడ్డీ భారం మోయాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలమైన సెక్యూరిటీ ఫీచర్స్‌తో ఉన్న కార్డులను తీసుకోవాలని.. అదే సమయంలో కార్డులను జారీ చేసే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు మోసాలను అడ్డుకునే శక్తి ఉందో..? లేదో? తెలుసుకుంటే మంచిది. కార్డులను తీసుకునే ముందే అన్నింటి గురించి తెలుసుకోవాలని.. గుడ్డిగా ఏ కార్డులను వాడడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.