WhatsApp | ఈ వాట్సాప్‌ ఫీచర్‌ మామూలుగా లేదుగా..! కాంటాక్ట్‌ నంబర్లకు స్టేటస్‌ అప్‌డేట్‌ నోటిఫికేషన్‌..!

  • Publish Date - April 10, 2024 / 08:00 AM IST

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న యాప్‌లలో ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ వాట్సాప్‌ ఒకటి. ఈ క్రమంలో కంపెనీ సైతం యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తుంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా మరో ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. యూజర్ల కాంటాక్ట్‌ సభ్యులతో మరింత దగ్గర చేసేందుకు ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. యూజర్లు వాట్సాప్‌ స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో పంపే వెసులుబాటును తీసుకురాబోతున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నది. త్వరలోనే అందుబాటులోకి తీసుకరాబోతున్నట్లుగా సమాచారం. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఎవరైనా ఓ యూజర్‌ తన వాట్సాప్‌ స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసిన సమయంలోని కాంటాక్ట్‌ సభ్యులందరికీ నోటిఫికేషన్‌ పంపేందుకు వీలుండనున్నది.

ప్రస్తుతం ఎవరైనా స్టేటస్‌లు పెట్టిన సమయంలో చాలా మంది చూడడం లేదు. ఈ క్రమంలో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఎవరైనా చూడకపోతే వారికి నోటిఫికేషన్స్‌ రూపంలో అలెర్ట్‌ వెళ్తుంది. ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉండగా.. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియరాలేదు. అయితే, కొత్తగా వాట్సాప్‌ కొత్తగా తీసుకువస్తే ఫీచర్స్‌లో ఒకటి స్టేటస్‌ అప్‌డేట్‌ నోటిఫికేషన్‌ ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాంటాక్ట్స్‌ జాబితాలోని తమకు నచ్చిన వారితో చాటింగ్‌ కోసం సైతం నోటిఫికేషన్‌ పంపే ఫీచర్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు ‘సజెస్టెడ్ చాట్’ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొత్త కాంటాక్టులతో చాటింగ్‌ను ఈ ఫీచర్ సులభతరం చేస్తుందని.. యూజర్ల మధ్య కమ్యూనికేషన్‌ను మరింత ప్రోత్సహిస్తుందని వాట్సాప్‌ భావిస్తున్నది. అయితే, ఈ ఫీచర్‌ను చాట్‌లిస్ట్‌లో దిగువ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఈ ఫీచర్స్‌పై కంపెనీ ప్రకటన చేసే అవకాశం ఉన్నది.

Latest News