iBomma Shutdown : మీ దేశంలో వెబ్‌సైట్‌ను మూసివేస్తున్నాం..ఐ బొమ్మ ప్రకటన

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో, ఈ వెబ్‌సైట్ దేశంలో తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

iBomma Shutdown : మీ దేశంలో వెబ్‌సైట్‌ను మూసివేస్తున్నాం..ఐ బొమ్మ ప్రకటన

విధాత, హైదరాబాద్ : ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐ బొమ్మ వెబ్ సైట్ తన సేవలను దేశవ్యాప్తంగా శాశ్వతంగా నిలిపేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. ‘ఇటీవల మా గురించి మీరు వినే ఉంటారు. మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. మా సేవలను నిలిపివేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం’ అని వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా పైరసీపై దాడులు తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఐబొమ్మ నిర్వాహకుడిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు దాని తరువాతే ఈ ప్రకటన వెలువడింది. కాగా, ఐబొమ్మ వెబ్‌సైట్ మూసివేయడంతో పైరసీ సినిమాల వీక్షణకు అలవాటు పడిన చాలా మంది వినియోగదారులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు సినిమా పరిశ్రమ మాత్రం దీనిని సానుకూల పరిణామంగా చూస్తోంది. అయితే, ఈ మధ్య కాలంలో ఐ బొమ్మ వెబ్ సైట్ ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఇందులో భాగంగానే నెల రోజుల క్రితం వెబ్ సైట్ నిర్వహకుల్లో కీలకమైన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన హైదరాబాద్ నగర హైదరాబాద్ నగర సీవీ ఆనంద్ పైరసీ వెబ్‌సైట్స్ ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించినా సరే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా, ఆ వెబ్ సైట్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.