• Telugu News
  • /National

Cyber Crime | వ్యాపారి ఫోన్‌కు ఒక్క‌సారిగా 200కిపైగా మెసేజ్‌లు.. చూస్తే బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ..!

బెంగ‌ళూరుకు చెందిన ఓ వ్యాపారి (Bengaluru Businessman)కి ఊహించ‌ని షాక్ (Cyber Crime) త‌గిలింది. అత‌డి ఫోన్‌కు ఒక్క‌సారిగా 200కిపైగా మెసేజ్‌లు (200 SMS alerts) వ‌చ్చాయి. వాటిని చూడ‌గా.. షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అత‌డి బ్యాంకు ఖాతాల నుంచి రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌దిలీ అయిన‌ట్లు తేలింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 11, 2026, 2:21 pm IST
Read Time: 5 mins
Cyber Crime | వ్యాపారి ఫోన్‌కు ఒక్క‌సారిగా 200కిపైగా మెసేజ్‌లు.. చూస్తే బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ..!

Cyber Crime | దేశంలో సైబ‌ర్ నేరాలు (Cyber Crime) పెరిగిపోయాయి. సైబ‌ర్ నేర‌గాళ్లు రోజుకో కొత్త విధానంలో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యావంతులే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌లు సైబ‌ర్ ఉచ్చులో చిక్కుకుని ఇప్ప‌టికే రూ.ల‌క్ష‌ల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. తాజాగా బెంగ‌ళూరుకు చెందిన ఓ వ్యాపార‌వేత్త (Bengaluru Businessman) సైబ‌ర్ ఉచ్చులో చిక్కుకుని.. భారీగా సొమ్ము పోగొట్టుకున్నాడు.

న‌గ‌రంలోని హెచ్ఆర్‌బీఆర్ లేఔట్‌లో నివాసం ఉండే ఓ 56 ఏళ్ల వ్యాపారి ఫోన్‌కు వ‌రుస‌గా మెసేజ్‌లు వ‌చ్చాయి. ఒక‌టి, రెండు కాదండోయ్‌.. ఏకంగా 200కిపైగా మెసేజ్‌లు (200 SMS alerts) వ‌చ్చాయి. ఇన్నిగ‌నం మెసేజ్‌లు రావ‌డంతో అత‌డు ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు. ఆ మెసేజ్‌లు ఏంటా..? అని ఫోన్ చూడ‌గా.. అంతే షాకింగ్ విష‌యం బ‌య‌ట‌డింది. తన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగినట్టు తేలింది.

వెంట‌నే అత‌ను బ్యాంకు అధికారుల‌ను సంప్ర‌దించాడు. అక్క‌డ తేలిందేంటంటే..? సైబర్ మోసగాళ్లు అత‌డి బ్యాంకు ఖాతాలను హ్యాక్ (Bank accounts hacked) చేసి సుమారు రూ.10 లక్షలు దోచుకున్నారు. బ్యాంకు అధికారులు చెప్పిన ఈ విష‌యంతో ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. వెంట‌నే లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారాన్ని తీసుకుని పోలీసు స్టేష‌న్‌కు వెళ్లాడు. ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 5 మధ్యాహ్నం 1 గంట మధ్య ఈ లావాదేవీలు జరిగాయని తెలిపాడు. ఫోన్‌కు వచ్చిన 200కుపైగా ఎస్ఎంఎస్‌లలో చాలా వరకు ఓటీపీలు, డెబిట్ అలర్టులు ఉన్నాయని చెప్పాడు. ఒక ఖాతా నుంచి రూ.26వేలు విత్ డ్రా అయ్యింద‌ని, మరొక ఖాతా నుంచి పలు విడతల్లో రూ.9.60 లక్షలకుపైగా విత్ డ్రా చేశార‌ని తెలిపాడు. ఈ మేర‌కు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఫోన్‌లో ఏవైనా ఏపీకే (APK) ఫైల్స్‌ను క్లిక్ చేసి ఉంటాడ‌ని అనుమానిస్తున్నారు. ఆ కార‌ణంగానే అత‌డి ఫోన్ హ్యాక్‌కుగురై అందులోని స‌మాచారం మొత్తం హ్యాక‌ర్ల చేతిలోకి వెళ్లి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఫోన్‌కు వ‌చ్చే ఓటీపీల‌తో డ‌బ్బు విత్‌డ్రా చేసుకుని ఉంటార‌ని అనుమానిస్తున్నారు. తెలియ‌ని నంబ‌ర్ల నుంచి వ‌చ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్ద‌ని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

AP Ministers Maoist Threat| ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు
OTT Movies | సంక్రాంతి బ్లాక్‌బస్టర్లు ఓటీటీలోకి.. ఒకే రోజు స్ట్రీమింగ్‌తో డిజిటల్ ప్రేక్షకులకు డబుల్ ట్రీట్