kaantha| ‘కాంత’ నుంచి ‘పసి మనసే.. వినదసలే’ సాంగ్
విధాత :దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse), సముద్రఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (kaantha)సినిమా నుంచి ‘పసి మనసే.. వినదసలే(Pasi Manase)’ అంటూ సాగే మెలోడి సాంగ్ (song)ను మేకర్స్ విడుదల చేశారు.పెద్దగా మ్యూజిక్ డామినేటింగ్ లేకుండా..సంగీత..సాహిత్యాల మెళవింపుతో ప్రశాంతంగా సాగిన ఈ పాటకు జాను చంతర్ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ప్రదీప్‌కుమార్, ప్రియాంక ఎన్‌కే ఆలపించారు. సెప్టెంబరు 12న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ‘కాంత’ సినిమా 1950లో మద్రాస్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఇందులో చంద్రన్ అనే సినీ హీరోగా దుల్కర్ నటిస్తుండగా, అయ్య అనే ఓ సీనియర్ దర్శకుడిగా సముద్రఖని కనిపిస్తారు. రానా, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram