Raju Weds Rambai : 21న థియేటర్లలోకి ‘రాజు వెడ్స్ రాంబాయి’
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా నవంబర్ 21న థియేటర్లలో విడుదల. పల్లెటూరు ప్రేమకథ ఆధారంగా అఖిల్, తేజస్విని జంటగా రూపొందిన చిత్రం.
విధాత: స్వచ్చమైన పల్లెటూరు ప్రేమకథతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ఈ నెల 21న థియేటర్లలోకి రానుంది. అఖిల్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లో హీరోహీరోయిన్ల పల్లెటూరు ప్రేమకథ..వారి పెళ్లికి ఎదురైన కష్టాలు ఆధ్యంతం ఆకట్టుకునేలా సాగాయి. తమ ప్రేమ..పెళ్లి పీటలు ఎక్కాలంటే ముందుగా వారు తల్లిదండ్రులుగా మారాలని పెళ్లికి ముందే ఆ ప్రేమజంట ఒక్కటవ్వడం..అయినా వారి పెళ్లికి అవాంతరాలు ఎదురవ్వడం..చివరకు వారి ప్రేమకు దక్కిన ముగింపు ఏమిటన్నదానిపై ట్రైలర్ ఆసక్తి రేపింది.
‘ఈటీవీ విన్ ఒరిజినల్స్’ లో రూపొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాని ఈ నెల 21న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram