Hero Raj Tarun | రాజ్ తరుణ్, లావణ్య కేసులో కొత్త ట్విస్ట్

సినీ హిరో రాజ్‌తరుణ్‌పై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులకు లావణ్య తగిన సాక్ష్యాధారాలు అందచేశారు. రాజ్ తరుణ్‌కు, నాకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, అన్విక అనే పేరుతో మేం కాపురం చేశామని లావణ్య తెలిపారు

Hero Raj Tarun | రాజ్ తరుణ్, లావణ్య కేసులో కొత్త ట్విస్ట్

నాకు అబార్షన్ చేయించాడు..మాకు పదేళ్ల క్రితమే పెళ్లి
పోలీసులకు ఆధారాలు అందించిన లావణ్య

విధాత, హైదరాబాద్ : సినీ హిరో రాజ్‌తరుణ్‌పై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులకు లావణ్య తగిన సాక్ష్యాధారాలు అందచేశారు. రాజ్ తరుణ్‌కు, నాకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, అన్విక అనే పేరుతో మేం కాపురం చేశామని లావణ్య తెలిపారు. అదే పేరుతో విదేశాలకు వెళ్లామని, కొన్నాళ్ల క్రితం నాకు రాజ్‌తరుణ్ అబార్షన్ చేయించాడని అందుకు సంబంధించి మెడికల్ డాక్యుమెంట్లను పోలీసులకు అందించింది.

పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని, తనని రెచ్చగొట్టి.. ఉద్దేశపూర్వకంగా తన ఆడియోలు రికార్డ్ చేశాడని చెప్పిన లావణ్య తమ జీవితంలోకి మాల్వీ మల్హోత్ర వచ్చాకే నన్ను దూరం పెట్టాడని ఆరోపించింది. మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని లావణ్య ఆరోపించింది. రాజ్‌తరుణపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి నార్సింగి పోలీసులకు 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్‌ను లావణ్య అందచేశారు. రాజ్ తరుణ్‌పై ఐపీసీ 493తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అటు మాల్వీ మల్హోత్ర సైతం తనను, తన సోదరుడిని బెదిరిస్తూ లావణ్య మెసేజ్‌లు పెడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.