Akkineni|అక్కినేని అభిమానులకి ఇది డబుల్ గుడ్ న్యూసే..అయ్యగారు స్పీడ్ మాములుగా లేదు..!
Akkineni|కొన్ని నెలల క్రితం సమంత, నాగ చైతన్య( Naga Chaitanya) విడాకులు అక్కినేని అభిమానులని ఎంతగానో బాధించాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారని ఫ్యాన్స్ అయితే తలలు పట్టుకున్నారు. ఇప్పటికీ వారి విడాకులకి కారణం తెలియదు. కట్ చేస్తే ఇటీవ

Akkineni|కొన్ని నెలల క్రితం సమంత, నాగ చైతన్య( Naga Chaitanya) విడాకులు అక్కినేని అభిమానులని ఎంతగానో బాధించాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారని ఫ్యాన్స్ అయితే తలలు పట్టుకున్నారు. ఇప్పటికీ వారి విడాకులకి కారణం తెలియదు. కట్ చేస్తే ఇటీవల చైతూ టాలీవుడ్ నటి అయిన శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ జరుపుకొని పెద్ద షాకే ఇచ్చాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. దీంతో మళ్లీ అక్కినేని (Akkineni)ఇంట సంబురాలు అంబరాన్ని అంటనున్నాయి. ఇక అఖిల్ విషయానికి వస్తే ఆయన ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగిన పెళ్లికి వచ్చే సరికి క్యాన్సిల్ అయింది. అప్పటి నుండి అఖిల్ సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ‘ఏజెంట్’ (Agent)సినిమా పరాజయం తర్వాత మళ్లీ కొత్త సినిమా అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే అక్కినేని నట వారసత్వం, హాలీవుడ్ హీరోలను తలదన్నే అందం. ఇవన్నీ ఉన్నా.. కూడా అఖిల్‌కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడకపోవడం అక్కినేని ఫ్యాన్స్‌ని చాలా బాధిస్తుంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓ మోస్తరు హిట్ టాక్‌తో ఆడిన మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. అసలు అఖిల్ కు ఎలాంటి సినిమా పడాలి? అఖిల్‌ని ఎలా ప్రేక్షకులలో నిలబెట్టాలి? అనే ఆలోచనలో నాగార్జున తర్జన భర్జన పడుతున్నాడట. ఈ నేపథ్యంలోనే యువ డైరెక్టర్ చెప్పిన పీరియాడికల్ డ్రామా ప్రాజెక్ట్ కి అఖిల్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) వంటి హిట్టు సినిమా తీసిన మురళీ కిషోర్ (Murali Kishor Abburu) చెప్పిన కథ బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమాని త్వరలో అఖిల్ పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. మరో వైపు అనీల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేసేందుకు అఖిల్ రెడీ అయ్యాడట. దీనిని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం తన కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టిన అఖిల్.. తాజాగా 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు