Bath with Hot Water | చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
Bath with Hot Water | మీరు చలి( Cold )కి వణికిపోతున్నారా..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న చలికి భయపడి వేడి నీళ్లతో స్నానం( Bath with Hot Water ) చేస్తున్నారా..? అయితే మీరు రక్తపోటు( Blood Pressure ) సమస్యలతో పాటు తదితర అనారోగ్య సమస్యలను( Health Issues ) కొని తెచ్చుకున్నట్టే అని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు.
Bath with Hot Water | చలి గజగజ వణికిస్తోంది. చలి( Cold ) నుంచి రక్షణ పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ముఖ్యంగా చాలా మంది చలి కాలంలో వేడి నీటితో స్నానం( Bath with Hot Water ) చేస్తుంటారు. ఇలా వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదని, అనేక నష్టాలు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చరిస్తున్నారు. చలి కాలంలోనూ చల్లని నీటితోనే స్నానం చేయాలని సూచిస్తున్నారు. మరి వేడి నీళ్లతో స్నానం చేస్తే కలిగే నష్టాలేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
చర్మం త్వరగా పొడి బారిపోతుంది..
చాలా మంది వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోయి.. త్వరగా చర్మం పొడి బారిపోతుంది. చర్మంపై పగుళ్లు వచ్చి నరకం అనుభవిస్తారు. చర్మం బిగుతుగా అనిపిస్తుంది. దాంతో చర్మం పగిలి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వేడి నీళ్లతో స్నానం చేయకపోవడమే ఉత్తమం.
వేడి నీళ్లు తలపై చర్మానికి కూడా మంచిది కాదు..
ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే చర్మంలో చికాకు పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై దురద, మంట, దద్దుర్లు, ఎరుపు కనిపిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది వెంటనే ప్రభావితం చేస్తుంది. వేడి నీరు చర్మానికి మాత్రమే కాదు.. తలపై చర్మానికి కూడా మంచిది కాదు. తేమను లాగేస్తుంది. దీనివల్ల జుట్టు పొడిబారడం, చిట్లడం, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు పెరుగుతాయి.
రక్తపోటు సమస్యలు..
చర్మం తేమ కోల్పోయినప్పుడు.. దాని రక్షణ పొర బలహీనపడుతుంది. ఇది ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర చర్మ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అవసరానికి మించి వేడి నీరు చేస్తే.. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల కొందరిలో రక్తపోటు హెచ్చుతగ్గులు అవుతాయి. వృద్ధులకు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరమైనది. చాలా వేడి నీరు కొన్నిసార్లు మిమ్మల్ని శక్తివంతం చేయడానికి బదులుగా నీరసంగా మార్చవచ్చు. శరీరం మరింత రిలాక్స్ అవుతుంది. దీనివల్ల చాలా మంది స్నానం చేసిన తర్వాత అలసిపోతారు. కాబట్టి చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేసి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram