Allu Arjun| బ‌న్నీపై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఎట్ట‌కేల‌కి పిక్‌తో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన ఐకాన్ స్టార్

Allu Arjun| కొంత కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య వైరం నెల‌కొని ఉన్న‌ట్టు నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌ర‌గ‌డం మ‌నం చూశాం. అల్లు అర్జున్ వ‌ల‌న మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ దూరం అయింద‌నే వాద‌న కూడా ఉంది. అయితే ఈ వైరం గురించి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యం

  • By: sn    cinema    Jun 16, 2024 10:48 AM IST
Allu Arjun| బ‌న్నీపై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఎట్ట‌కేల‌కి పిక్‌తో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన ఐకాన్ స్టార్

Allu Arjun| కొంత కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య వైరం నెల‌కొని ఉన్న‌ట్టు నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌ర‌గ‌డం మ‌నం చూశాం. అల్లు అర్జున్ వ‌ల‌న మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ దూరం అయింద‌నే వాద‌న కూడా ఉంది. అయితే ఈ వైరం గురించి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో అల్లు అర్జున్ త‌న కుటుంబానికి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతిచ్చాడు. ఏకంగా ఆయ‌న కోసం నంద్యాల వెళ్లి ప్ర‌చారం చేశారు. ఇక అప్పటి నుంచీ అతనిపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ ఏకంగా అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేశాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అల్లు ఫ్యామిలీ నుంచి ఎవ‌ర‌న్నా హాజరయి ఉన్నా వివాదం స‌ద్దుమ‌ణిగి ఉండేది. కాని ఎవ‌రు రాక‌పోవ‌డంతో ఈ వివాదం మ‌రింత ముదిరింది. అల్లు అర్జున్ సినిమాల‌ని ఎంక‌రేజ్ చేయోద్దంటూ కూడా కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప‌2పై దీని ఎఫెక్ట్ త‌ప్ప‌క ఉంద‌ని కొంద‌రు సినీ ప్ర‌ముఖులు చెప్పుకొస్తున్నారు. అయితే అల్లు అర్జున్ గురించి అనేక ప్ర‌చారాలు, విమ‌ర్శ‌లు, రూమర్స్ న‌డుస్తున్నా కూడా ఏ నాడు కూడా స్పందించింది లేదు. సైలెంట్‌గానే ఉన్నారు.

ఈ తరుణంలో అల్లు అర్జున్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఫాదర్స్ డే సంద‌ర్భంగా బన్నీ తన తండ్రి అల్లు అరవింద్ పై ప్రేమ చాటుతూ ఎమోషనల్ పిక్ షేర్ చేశాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అంటూ బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఈ ఫొటో అల్లు అర్జున్ కి చెందిన AAA సినిమాస్ థియేటర్ ప్రారంభం స‌మ‌యంలో తీసిన పిక్. ఈ ఫొటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.. అల్లు అర్జున్ AAA సినిమాస్ ని గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇప్ప‌టికీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కాలేద‌ని, సీజీ వ‌ర్క్ కూడా పూర్తి కాలేద‌ని అంటున్నారు.