Anchor| ప్రస్తుతం బుల్లితెరపై పలువురు అందాల భామలు యాంకరింగ్‌తో అదరగొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. వారిలో యాంకర్ స్రవంతి చొక్కారపు ఒకరు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉన్న ఈ చిన్నది.. సుదీర్ఘ కాలంగా తనదైన హవా చూపిస్తూ అశేష ప్రేక్షకాదరణ దక్కిం
Anchor| ప్రస్తుతం బుల్లితెరపై పలువురు అందాల భామలు యాంకరింగ్‌తో అదరగొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. వారిలో యాంకర్ స్రవంతి చొక్కారపు ఒకరు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉన్న ఈ చిన్నది.. సుదీర్ఘ కాలంగా తనదైన హవా చూపిస్తూ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని సందడి చేసింది. రాయలసీమ అమ్మాయి అయిన స్రవంతి చొక్కారపు ఉద్యోగం చేస్తున్న సమయంలో సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లి అందులో నటించింది. అలా నటిగా పరిచయమైన ఈ భామ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే అవి ఆమెకి సరైన రీతిలో గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో ఆమె సినిమాలు ఆపేసి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది.
బుల్లితెరపై పలు చానెళ్లలో పలు షోలకి కూడా యాంకరింగ్ చేసింది. వాటిలో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ మాత్రమే ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే స్రవంతికి పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ షోకి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తున్న ఈ భామ రోజు రోజుకి తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ పోతుంది.
ఇక స్రవంతి చాలా ఏళ్ల క్రితమే ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా జన్మించాడు. అయినప్పటికీ ఈ భామ ఇండస్ట్రీలో నెట్టుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సుధీర్‌తో ‘ఫ్యామిలీ స్టార్స్’ షోలో ఫన్ చేస్తోంది. అయితే స్రవంతి భర్త ఆమె డ్రెస్సింగ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్రవంతి డ్రెస్సింగ్ విషయంలో మీరు ఏమైన సలహాలు , సూచనలు ఇస్తుంటారా అని భర్త ప్రశాంత్‌ను సదరు యాంకర్ ప్రశ్నించగా, ఆయన ఊహించని సమాధానం ఇచ్చారు. ఆమె విషయంలో నేను ఏది కలగజేసుకోను. నేను ఏది చెప్పిన ఆమెకి నచ్చదు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్లోనాకు పెద్దగా ఐడియా లేకపోవడంతో నిర్ణయం ఆమెకే వదిలేశాను అని స్రవంతి భర్త అన్నారు. ఆమెకి కొన్ని సార్లు సలహాలు ఇవ్వడం జరిగింది, నా సూచనలు ఆమెకి నచ్చకపోవడంతో అప్పటి నుండి ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం స్రవంతి భర్తకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.