Priyanka| నువ్వు జెండ‌ర్ మార్చుకున్నావ్‌గా పీరియ‌డ్స్ వ‌స్తాయా అని అడిగిన యాంకర్.. బిగ్ బాస్ పింకీ ఫైర్

Priyanka| పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్‌లో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా లేడి గెట‌ప్స్ వేసి ఆ త‌ర్వాత అమ్మాయిగా మారి అంద‌రి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక సింగ్. బిగ్ బాస్ షోలో దాదాపు 90 రోజుల పాటు సంద‌డి చేసి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచు

  • By: sn    cinema    Jul 12, 2024 11:25 AM IST
Priyanka| నువ్వు జెండ‌ర్ మార్చుకున్నావ్‌గా పీరియ‌డ్స్ వ‌స్తాయా అని అడిగిన యాంకర్.. బిగ్ బాస్ పింకీ ఫైర్

Priyanka| పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్‌లో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా లేడి గెట‌ప్స్ వేసి ఆ త‌ర్వాత అమ్మాయిగా మారి అంద‌రి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక సింగ్. బిగ్ బాస్ షోలో దాదాపు 90 రోజుల పాటు సంద‌డి చేసి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక ఈ మ‌ధ్య యాంకర్ శివతో కలిసి ఢీ జోడీ డాన్స్ షోలో పాల్గొంది. అందులో త‌న డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింది. అయితే మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు విప‌రీత‌మైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేయ‌డంతో ఒళ్లు నొప్పులు వ‌చ్చాయి. దాంతో పెయిన్ కిల్ల‌ర్స్ వాడింది. మాత్రలు అతిగా వేసుకొని తీవ్రమైన జ్వరంతో పరిస్థితి సీరియస్‌ అయి ఆసుపత్రిలో చేరింది. ఈ విష‌యాన్ని త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియ‌జేసింది.

అయితే ప్రియాంక సింగ్‌ ట్రాన్స్‌ జెండర్ అని ఆమె చెప్పే వ‌ర‌కు తెలియ‌దు. అంత అందంతో ఆక‌ట్టుకుంటుంది. అయితే ఇటీవల ఓ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం వేదికగా యాంకర్‌ శివ ప్రియాంక సింగ్‌ను చేసిన ఇంటర్వ్యూ చేస్తూ.. ఇప్పుడు నువ్వు పూర్తిగా అమ్మాయివి.. అమ్మాయిలకి ఎలా ఉంటుందో నీకు అలానే… మంత్లీ మంత్లీ మొత్తం అంటూ.. పీరియడ్స్ గురించి శివ‌ అడుగుతాడు. దానికి ప్రియాంక‌.. నువ్వు అంద‌రిని అడిగిన‌ట్టు ఇలాంటి ప్ర‌శ్న‌లు అడ‌గొద్దు. అలా అడిగితే నేను రాను అని చెప్పా. అయినా మళ్లీ అదే ప్రశ్నలు అడుగుతున్నావ్… ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్లది. నాకు ఇది అవుతుంది, ఇది అవ్వదు.. నాకు ఇది చేయాలని ఉందని కెమెరా ముందు చెప్పుకోవాలా..?…’’ ఓపెన్‌గా మాట్లాడటమంటే ఇదేనా… ఆఫ్‌ కెమెరాలో అయితే నీకు సరిగ్గా చెబుతా అంటూ గ‌ట్టిగానే ఇచ్చి ప‌డేసింది.

ఇక ట్రాన్స్‌ జెండర్లు నిన్ను చిన్నచూపు చూస్తున్నారని యాంకర్‌ ప్రస్తావించగా… ‘‘నేనందరికీ నచ్చాలని లేదు. నన్ను చిన్నచూపు చేసేవారిని నేను ఏ మాత్రం పట్టించుకోను. వాళ్లెవరూ నన్ను, నా ఫ్యామిలీని పోషించరు. అలా చూసేవారందరి కంటే నేను మంచి పొజీష‌న్‌లోనే ఉన్నా క‌దా అని తెలియ‌జేసింది. అయితే ట్రాన్స్ జెండ‌ర్ గురించి యాంక‌ర్ ప‌దే ప‌దే అన‌డంతో అలా మీరందరూ, ట్రాన్స్ జెండర్లు అనడం తనకు నచ్చదని.. ‘‘ప్రియాంక సింగ్ ఈజ్ ఏ గల్‌, వుమెన్.. ఐ డోంట్ వాంట్ టూ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ ఏ ట్రాన్స్‌ జెండర్‌. నువ్వెందుకు అలా చూడలేకపోతున్నావ్‌. అంద‌రం మ‌నుషుల‌మే కదా, ఎందుకు ఆ ట్యాగ్ లైన్స్ అంటూ ఫైర్ అయింది ప్రియాంక సింగ్