Ram Charan, Upasana Expecting Twins | ట్విన్స్ కు జన్మినివ్వబోతున్న ఉపాసన రామ్ చరణ్!?
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దీపావళి సందర్భంగా ఉపాసన షేర్ చేసిన వీడియోకు 'రెట్టింపు ఆనందం, రెట్టింపు ప్రేమ' అని క్యాప్షన్ ఇవ్వడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.

విధాత : మెగా కుటుంబంలోకి కవలలు రాబోతున్నారా?..మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన్ రామ్ చరణ్ కవలలకు జన్మనివ్వబోతుందా? అంటే..అవునంటున్నాయి ఫిల్మ్ సర్కిల్ వర్గాలు. మెగా కుటుంబంలో దీపావళి వేడుకల సందర్భంగా ఉపాసన తాను మరోసారి తల్లి కాబోతున్నట్లుగా.. సీమంతం దృశ్యాలతో కూడిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. తన వీడియోకు “ఈ దీపావళి వేడుక రెట్టింపు ఆనందం, రెట్టింపు ప్రేమ, రెట్టింపు ఆశీర్వాదాలతో నిండిపోయింది” అని క్యాప్షన్ గా రాశారు. వీడియో చివర్లో “న్యూ బిగినింగ్స్” (కొత్త ప్రారంభాలు) అని కూడా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా…ఉపాసన ఈ ధఫా కవలలకు జన్మనివ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఉపాసనకు పుట్టేది కవల పిల్లలని..మెగా కుటుంబంలో డబుల్ బోనంజా రాబోతుందని తెలుస్తుంది. ఆమె దీపావళీ క్యాప్షన్ అంతరార్ధం కూడా అదే అనుకుంటున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు క్లింకారా అనే అమ్మాయి తొలి సంతానంగా ఉంది. ఈ దఫా అబ్బాయి పుట్టాలని మెగా కుటుంబం..అభిమానులు ఆశ పడుతున్నారు. అయితే ఉపాసన మాత్రం ఒక్కరికి కాదు..ఇద్దరు పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లుగా అంతర్గత సమాచారం వైరల్ అవుతుంది. అదే నిజమై ఉపాసన రామ్ చరణ్ కవలలకు జన్మనిస్తే..గతంలో మెగాస్టార్ చిరంజీవి ఆశించినట్లుగా మెగా వారసుడి రాకకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.