Varun Tej | వ‌రుణ్ మొబైల్‌లో.. లావ‌ణ్య పేరు ఏమ‌ని సేవ్ అయి ఉంటుందంటే..!

Varun Tej | గ‌త కొద్ది రోజులుగా వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి జంట‌ల పేర్లు సోషల్ మీడియాలో తెగ నానుతూ వ‌స్తున్నాయి. కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వ‌రుణ్‌- లావ‌ణ్య‌లు జూన్ 9న నిశ్చితార్థంతో ఒక్క‌ట‌య్యారు. వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో చాలా సింపుల్‌గా జ‌రిగింది. ఇక న‌వంబ‌ర్‌లో ఇట‌లీ వేదిక‌గా వీరి వివాహం కూడా జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. అయితే వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం గాండీవ‌ధారి అర్జున ఆగ‌స్ట్ 25న విడుద‌ల కానుండ‌గా, […]

  • By: sn    latest    Aug 23, 2023 3:50 AM IST
Varun Tej | వ‌రుణ్ మొబైల్‌లో.. లావ‌ణ్య పేరు ఏమ‌ని సేవ్ అయి ఉంటుందంటే..!

Varun Tej |

గ‌త కొద్ది రోజులుగా వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి జంట‌ల పేర్లు సోషల్ మీడియాలో తెగ నానుతూ వ‌స్తున్నాయి. కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వ‌రుణ్‌- లావ‌ణ్య‌లు జూన్ 9న నిశ్చితార్థంతో ఒక్క‌ట‌య్యారు. వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో చాలా సింపుల్‌గా జ‌రిగింది. ఇక న‌వంబ‌ర్‌లో ఇట‌లీ వేదిక‌గా వీరి వివాహం కూడా జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు.

అయితే వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం గాండీవ‌ధారి అర్జున ఆగ‌స్ట్ 25న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో కొద్ది రోజులుగా బిజీగా ఉన్నాడు మెగా ప్రిన్స్. ఈ ప్ర‌మోష‌న్స్ లో త‌న ల‌వ్ గురించి , ఇత‌ర విష‌యాల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. తాజాగా సుమ షోకి హాజ‌రైన వ‌రుణ్ తేజ్ త‌న ఫోన్‌లో లావ‌ణ్య త్రిపాఠి పేరు ఎలా సేవ్ అయి ఉంటుందో తెలియ‌జేశాడు.

తన మొబైల్ లో లావణ్య పేరు LAVN అని సేవ్ చేసి ఉంటుంద‌ని, అది లావణ్యనే స్వయంగా ఆలా సేవ్ చేసిందని పేర్కొన్నాడు. ఇక లావణ్య త్రిపాఠి, నిహారిక ఇద్దరి నుంచి ఒకేసారి ‘అర్జెంటు ఫోన్ చెయ్’ అని మెసేజ్ వస్తే ముందు ఎవరికి ఫోన్ చేస్తావ్ అని సుమ అడ‌గ‌గా, దానికి స్పందించిన వ‌రుణ్ తేజ్.. నిహారిక‌కే అని అన్నాడు.

నిహారిక చిన్న పిల్ల స‌మ‌స్య‌ల‌ని హ్యాండిల్ చేయ‌లేదు, లావ‌ణ్య త్రిపాఠి అలా కాదు ఎలాంటి స‌మ‌స్య‌నైన హ్యాండిల్ చేయ‌గ‌ల‌ద‌ని స్ప‌ష్టం చేశాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ లో ఎవరిది ఇమిటేట్ చేయడానికి ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తావు అని అడ‌గ‌గా, దానికి వరుణ్‌.. అవి చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని పేర్కొన్నాడు.

రామ్ చరణ్, అల్లు అర్జున్ ల‌కి పెళ్లి అయిన‌ తర్వాత ఎవరిలో ఎక్కువ‌ మార్పు వచ్చిందని సుమ అడిగారు. దానికి వ‌రుణ్ తేజ్.. పెళ్లయ్యాక ఎవరిలో అయినా మార్పు రావాల్సిందే అని ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. వ‌రుణ్ తేజ్ ఆస‌క్తిక‌రంగా చెప్పిన స‌మాధానాలు ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు మొద‌ల‌య్యాయి. నవంబ‌ర్ 1న డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా వీరి వివాహం ఉంటుంద‌ని తెలుస్తుంది. ఆగస్టులోనే వీరి వివాహం జరగాల్సి ఉన్న‌ప్ప‌ టికీ వ‌రుణ్ తేజ్ సినిమాలు ఒకవైపు.. నిహారిక విడాకులు వ్యవహారం వంటి కారణాల వ‌ల‌న పెళ్లిని కొద్ది రోజుల పాటు వాయిదా వేశారు.