RRR| దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి ఈ చిత్రాన్ని చేయగా,ఈ మూవీ ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అశేష ఆదరణ దక్కించు
RRR| దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి ఈ చిత్రాన్ని చేయగా,ఈ మూవీ ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అశేష ఆదరణ దక్కించుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ తో పాటు ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఇక ఈ మూవీపై హాలీవుడ్ నటులు, దర్శకులు ప్రశంసలు కురిపించడం మనం చూశాం. ఇక తాజాగా హాలీవుడ్ ఆస్కార్ నటి.. రాజమౌళితో పాటు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి పని చేయాలనుందని తమ మనసులో మాట బయటపెట్టారు.
హాలీవుడ్ నటి, ఆస్కార్ విన్నర్ అన్నే జాక్వెలిన్ హాత్వే.. ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి పనిచేయాలని ఉందని తాజాగా పేర్కొంది. ఆమె ఇంటర్ స్టెల్లార్, బ్రైడ్ వార్స్, పాసెంజర్స్, లెస్ మిసెర్బుల్స్, ది ఇంటర్న్.. లాంటి ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించగా, వాటితో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే ఓ ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడిన ఆమె.. అందరికి నచ్చినట్టే నాకు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా చాలా నచ్చేసింది. ఆ టీమ్‌లో ఎవరితోనైన కలిసి పని చేయాలని ఉందని తెలియజేసింది. దీంతో అన్నే వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి అన్నే కోరిక మేరకు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరైన ఆమెకి ఛాన్స్ ఇస్తారా చూడాల్సి ఉంది..
ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతో పాటు వార్ 2 చేస్తున్నాడు. అటు రామ్ చరణ్..శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ రెండు చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి.. మహేష్ బాబుతో భారీ స్కేల్ చిత్రం ప్లాన్ చేశాడు . ఈ మూవీ మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనుంది.