బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం పలు భాషలలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ వినోదం పంచుతుంది. అయితే తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న షో త్వరలో ఎనిమిదో సీజన్ కూడా జరుపుకోనుంది. అయితే తాజాగా సీజన్ 8కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 జూన్‌లోనే ప్రారంభం కానుందని అంటున్నారు. బిగ్ బాస్ షోకి మొదట్లో బాగానే పాపులారిటీ దక్కిన సీజన్ 5,6 మాత్రం కాస్త నిరాశపరిచాయి. అయితే బిగ్ బాస్ 7ను ఉల్టా పుల్టా సీజన్ అంటూ నాగార్జున ప్రకటించారు. దీంతో షో రసవత్తరంగానే సాగింది. మంచి రేటింగ్ కూడా వచ్చింది.
అయితే ఎనిమిదో సీజన్‌ని భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సీజన్7ని మించి ఇది ఉంటుందని టాక్. ఇక ఈ షోకి హోస్ట్‌గా పలువురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ అవన్నీ రూమర్స్ అని అంటున్నారు. నాగార్జుననే హోస్ట్‌గా ఉంటాడని తెలుస్తుంది. నాగార్జున ఈ రియాలిటీ షో కాన్సెప్ట్‌కు బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఆయననే ఎనిమిదో సీజన్‌కి హోస్ట్‌గా ఉంటారని సమాచారం. ఈ సారి ఎక్కువ మంది కాకుండా చాలా తక్కువ మందితో సీజన్8 కొనసాగేలా చూస్తున్నారంట. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్ సెలక్షన్ తో పాటు ఇతర పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తుంది. పాత కంటెస్టెంట్స్ సైతం ఈ షోలో పాల్గొని సందడి చేయనున్నారని అంటున్నారు. జూన్‌లో ప్రారంభం కానున్న ఈ షోకి సంబంధించిన అప్డేట్స్ మే లో బయటకు రానున్నట్లు తెలుస్తోంది.
ప్రతీసారి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో బుల్లితెర సెలబ్రిటీలు, సింగర్స్, డ్యాన్సర్స్.. ఇలా అందరూ ఆ హౌజ్‌లోకి వెళ్లి 100 రోజుల పాటు తెగ సందడి చేస్తుంటారు. కొందరు ప్రేమలో పడడం, మరి కొందరు గొడవలు పడుతుండడం ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంటుంది. అయితే ఈ సారి షోని మరింత రసవత్తరంగా మార్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, షో వంద రోజులకి పైగా ఉంటుందని అంటున్నారు. కొత్త సీజన్‌ను మరింత సరికొత్తగా తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా, దీనిపై అప్డేట్ మేలో ఇస్తారని తెలుస్తుంది.