Actor Pankaj Dheer | మహా భారత్ కర్ణుడు..నటుడు పంకజ్ ధీర్ మృతి

ప్రముఖ హిందీ సీరియల్ 'మహాభారత్'లో కర్ణుడి పాత్ర పోషించిన నటుడు పంకజ్ ధీర్ (68) క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. పలు టీవీ షోలు, సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు నికితిన్ ధీర్ కూడా నటుడే.

Actor Pankaj Dheer | మహా భారత్ కర్ణుడు..నటుడు పంకజ్ ధీర్ మృతి

విధాత : హిందీ ధారావాహిక మహాభారత్ లో కర్ణుడి పాత్రధారి పంకజ్ ధీర్ (68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధిలో బాధపడుతున్న పంకజ్ ధీర్ చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. పంకజ్ ధీర్ పలు టెలివిజన్ కార్యక్రమాలు ,సినిమాలు రెండింటిలోనూ నటించి మెప్పించారు. పంకజ్​ నటించిన బీఆర్ చోప్రా ‘మహాభారత్’, ‘సద్దా ముఖద్దర్’, ‘ఇక్కే పే ఇక్కా’ పాటు ‘చంద్రకాంత’, ‘ది గ్రేట్ మరాఠా’, ‘యుగ్’ అలాగే ‘బధో బహు’, ససురల్ సిమర్ కా వంటి వాటిలో పాత్రలు ఆయకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సడక్ సోల్జర్, బాద్‌షా వంటి పలు హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.

పంకజ్ ధీర్ 1956 నవంబర్‌ 9న పంజాబ్‌లో జన్మించారు.1980 ప్రారంభంలో నటన రంగంలోకి అడుగుపెట్టి బాలీవుడ్‌లో సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషిస్తూ, సినిమాల్లో కూడా నటించారు. పంకజ్ కు భార్య అనితా ధీర్‌, నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నారు.. ప్రస్తుతం నికితిన్ ధీర్ కూడా నటనలో రాణిస్తూ బిజీగా ఉన్నారు.నికితిన్.. సీరియల్ నటి క్రతికా సెంగర్‌ను పెళ్లి చేసుకున్నారు. పంకజ్ ధీర్ మరణ వార్త తెలుసుకున్నబుల్లితెరతో పాటుగా వెండితెర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.