Gangavva|గంగవ్వపై కేసు నమోదు.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటుందా, బయటకి వచ్చేస్తుందా?
Gangavva|గంగవ్వ.. ఈ పేరుకి ఇప్పుడు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె పేరు చెబితే ప్రతి ఒక్కరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవించే గంగవ్వ ‘మై విలేజ్ షో’ అనే ఛానల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. 60 ఏళ్ళ వయసులో బుల్లితెర, వెండితెరపై తనకంటూ

Gangavva|గంగవ్వ.. ఈ పేరుకి ఇప్పుడు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె పేరు చెబితే ప్రతి ఒక్కరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవించే గంగవ్వ ‘మై విలేజ్ షో’ అనే ఛానల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. 60 ఏళ్ళ వయసులో బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న గంగవ్వ (Gangavva)బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా అడుగుపెట్టి సందడి చేసింది. సీజన్ 4 లో కంటెస్టెంట్ గా తీసుకున్నారు. ఆ సమయంలో గంగవ్వ తోటి కంటెస్టెంట్స్‌తో కలిసి తెగ సందడి చేసింది.అయితే హౌజ్‌లోని వాతావరణం సెట్ కాక గంగవ్వ మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఇప్పుడు తిరిగి సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.
సీజన్ 8లోను కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తున్న గంగవ్వపై కేసు నమోదైంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 నిబంధనలను గంగవ్వ ఉల్లంఘించడంతో ఆమెపై కేసు నమోదైందని సమాచారం అందుతోంది. జగిత్యాల అటవీశాఖకు అందిన ఫిర్యాదు ఆధారంగా గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.మే 20,2022 రోజున యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ(Gangavva) చిలుక పంచాంగంకు సంబంధించిన ఓ వీడియోను అప్లోడ్ చేసారు. అయితే గంగవ్వ, రాజు యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘించారని, వినోదం కోసం చిలుకని ఉపయోగించడం చట్టం ఉల్లంఘన క్రిందకి వస్తుందని గౌతమ్ అనే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసాడు.
దీంతో జగిత్యాల అటవీశాఖ అధికారులు గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజు(Raju)పై కూడా కేసు నమోదు చేసారు. భారతీయ చిలుకలు వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద దీనిని వర్గీకరించబడింది. ఈ చట్టం చిలుకల అపహరణ, హింసల నుంచి కాపాడుతుంది. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన అటవీ రేంజ్ అధికారి పి పద్మారావు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా, కొండగట్టు దేవాలయం సమీపంలోని ఓ వీధిలో ఉండే జ్యోతిష్యుడి దగ్గర నుంచి రాజు ఈ చిలుకను తెచ్చినట్టు వెల్లడైంది. కాగా, బిగ్ బాస్‌లో ఉన్న గంగవ్వకి గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఏ రేంజ్‌లో హల్ చల్ చేశాయో మనం చూశాం. అయితే ఇదంతా ఫ్రాంక్ అని బిగ్ బాస్ టాస్క్‌లో ఇదో భాగమని, గంగవ్వకు హార్ట్ ఎటాక్ వస్తే ఇంటి సభ్యులు ఎలా స్పందిస్తారనే కాన్సెప్ట్ తో ఫ్రాంక్ రూపొందించారంటూ కొందరు క్లారిటీ ఇచ్చారు.