Chiranjeevi|ఏంటి.. అచ్చం ఆర్ఆర్ఆర్ మాదిరిగానే చిరంజీవి, మరో హీరో చేశారుగా..!

Chiranjeevi| ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా ప‌లు ఆస్కార్ అవార్డులు కూడా ద‌

  • By: sn    cinema    Apr 29, 2024 7:42 PM IST
Chiranjeevi|ఏంటి.. అచ్చం ఆర్ఆర్ఆర్ మాదిరిగానే చిరంజీవి, మరో హీరో చేశారుగా..!

Chiranjeevi| ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా ప‌లు ఆస్కార్ అవార్డులు కూడా ద‌క్కించుకుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి మ‌రింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి మ‌నదేశంలోనే కాదు ఇత‌ర దేశాల‌లో కూడా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు ల‌భించ‌డం గొప్ప ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అద్భుతంగా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఇర‌గ‌దీసారు. రాజ‌మౌళి డైరెక్ష‌న్ అద్భుతం. ఇక సంగీతంతో కీర‌వాణి మాయ చేశాడు.

అయితే ఈ సినిమాలోని ప్ర‌తి పాట కూడా సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించింది.ఇక సినిమాలో చివ‌రిగా వ‌చ్చే ఎత్త‌రా జెండా అనే పాట కూడా ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది.ఆ పాట‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో పాటు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, అలియా భ‌ట్, అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో పాటు ఇత‌ర ప్ర‌ముఖులు కూడా క‌నిపించి సంద‌డి చేస్తారు. అయితే ఈ పాట‌ని చిరంజీవి చేస్తే ఎలా ఉంటుందో ఓ వీడియో రూపంలో వ‌దిలారు. ఈ సాంగ్ సెట్ దాదాపు ఆర్ఆర్ఆర్ సినిమాలోని సాంగ్ సెట్ కు దగ్గర గా ఉంది. అలాగే ఆ సాంగ్ లో చిరంజీవి , మరో హీరో గెటప్ కూడా చరణ్, తారక్ లను పోలి ఉండ‌డంతో ఇప్పుడు తెగ వైర‌ల్ చేస్తున్నారు. క‌న్న‌డ మూవీ సిపాయికి సంబంధించింది ఈ సాంగ్ కాగా, మ‌రో హీరోగా ర‌విచంద్ర క‌నిపించి సంద‌డి చేశారు.

ఆర్ఆర్ఆర్ చిత్రం 2022 మార్చి 24న విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఏకంగా ఆస్కార్ వ‌ర‌కు వెళ్లింది. అక్క‌డ మూవీలోని ‘నాటునాటు’ పాట‌కు ఆస్కార్ అవార్డు కూడా ద‌క్కింది. 2022 అక్టోబ‌ర్ 21న ఈ మూవీ జ‌పాన్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌యింది. 44 న‌గ‌రాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్ తెర‌ల‌పై దీనిని ప్ర‌ద‌ర్శించ‌గా, ఈ చిత్రం 34 రోజుల్లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి 300 మిలియ‌న్ జపాన్ యెన్‌ల క్ల‌బ్‌లో చేరింది. భార‌త క‌రెన్సీలో దాదాపు రూ.18 కోట్లు. అక్క‌డ కూడా మూవీని అంత‌గా ఆద‌రిస్తుండడంపై ప్ర‌తి ఒక్క‌రు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు..