Bandla Ganesh Diwali Bash | ‘బండ్ల దివాళీ 2025’ పార్టీకి తరలొచ్చిన టాలీవుడ్
నిర్మాత బండ్ల గణేష్ తన నివాసంలో 'బండ్ల దివాళీ 2025' పేరుతో టాలీవుడ్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. చిరంజీవి, వెంకటేష్ సహా పలువురు తారలు హాజరైన ఈ పార్టీకి కోటిన్నర రూపాయలకు పైగా ఖర్చయినట్టు, చిరంజీవి కోసం ప్రత్యేక సింహాసనం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
విధాత : నటుడిగా చిన్నచితకా పాత్రలతో మొదలై టాలీవుడ్ బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ మరోసారి దీపావళి సెలబ్రేషన్స్ తో హాట్ టాపిక్ గా మారాడు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ‘బండ్ల దివాళీ 2025’ పేరుతో తన ఇంట దీపావళి పార్టీ నిర్వహించాడు. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సినీ తారలు, వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలుహాజరై సందడి చేశారు. బండ్ల ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీకాంత్, రోషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జ, జేడీ చక్రవర్తి, తరుణ్, మౌలి, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీపావళి పార్టీకి వచ్చిన వారి కోసం ఒక్కో విందు ప్లేటుకి 15,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి బండ్ల బడా విందు ఏర్పాటు చేశారు. మొత్తంగా పార్టీకి సుమారు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనికి డెకరేషన్ ఖర్చులు, క్రాకర్స్(బాణసంచా) ఖర్చులు అదనం. అంటే దాదాపు 2కోట్ల మేరకు ఖర్చు పెట్టి దీపావళీ ట్రీట్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
చిరంజీవి కోసం ప్రత్యేక సింహాసనం
బండ్ల గణేష్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ లు ఒకే కారులో వచ్చారు. చిరు కారు దిగగ్గానే బండ్ల గణేశ్ ఎదురెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు. తర్వాత చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆ విషయాన్నీ ఎక్స్ వేదికగా కూడా చెప్పుకున్నారు. మా బాస్ చిరంజీవి మా ఇంటికి వస్తారని.. ఆయనపై ప్రేమతో నేను ప్రత్యేకంగా ఒక సింహాసనం తయారు చేయించాను. ఆయన మా ఇంటికి వచ్చి.. ఆ సింహాసనంపై కూర్చోవడంతో నా మనసు ఉప్పొంగిపోయింది అని గణేష్ ఆనందం వెలిబుచ్చారు. గా కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న బండ్ల గణేశ్ ఇటీవల సినిమా ఈవెంట్లకు హాజరవుతూ తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే మళ్లీ సినిమాలలో బిజీ కావాలనే ఆలోచనతోన బండ్ల గణేష్ దివాళీ పార్టీ నిర్వహించినట్లుగా టాక్.
A glimpse of the grand Diwali celebrations hosted by blockbuster producer #BandlaGanesh in Hyderabad! 🎇
Megastar @KChiruTweets, Victory @VenkyMama, and many renowned film celebrities lit up the evening with their presence. ✨
Here’s the video capturing all the festive vibes and… pic.twitter.com/C8ZrAaQtQ3— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 20, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram