Pawan Kalyan | సుజిత్‌కు పవన్ కళ్యాణ్ లగ్జరీ కార్ గిఫ్ట్‌గా ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే!
Pawan Kalyan | టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన ‘ఓజీ’ సినిమాతో సుజిత్ తన సత్తా ఏంటో చూపించి, అభిమానులతో పాటు సినీ వర్గాలను కూడా ఆకట్టుకున్నారు.
Pawan Kalyan | టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన ‘ఓజీ’ సినిమాతో సుజిత్ తన సత్తా ఏంటో చూపించి, అభిమానులతో పాటు సినీ వర్గాలను కూడా ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు పెద్ద అభిమాని అయిన సుజిత్… ఆయన బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు తగ్గ కథను ఎంచుకుని సినిమా తెరకెక్కించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల పవన్ కళ్యాణ్ నుంచి సుజిత్‌కు అద్భుతమైన బహుమతి లభించిన విషయం తెలిసిందే. లగ్జరీ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్‌కు చెందిన ఖరీదైన రేంజ్ రోవర్ కారును పవన్ కళ్యాణ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని సుజిత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ…“నేను అందుకున్న గిఫ్టుల్లో ఇది అత్యుత్తమమైనది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా అత్యంత ప్రియమైన ‘ఓజీ’ కళ్యాణ్ గారి నుంచి లభించిన ప్రేమ, ప్రోత్సాహం నాకు అన్నిటికన్నా విలువైనవి. ఆయన అభిమానిగా మొదలై ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా అద్భుతం. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను” అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు.
ఈ కార్ గిఫ్ట్ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే చాలామంది ‘ఓజీ’ సినిమాతో అందరినీ మెప్పించినందుకే పవన్ కళ్యాణ్ ఈ బహుమతి ఇచ్చారని భావించారు. కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న కథనం ప్రకారం… అసలు కారణం అది కాదట. తాజా సమాచారం ప్రకారం, ‘ఓజీ’ మూవీ చివరి షెడ్యూల్‌కు సంబంధించిన ఒక కీలక భాగాన్ని జపాన్‌లో షూట్ చేయాలని సుజిత్ గట్టిగా పట్టుబట్టారట. అప్పటికే సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో నిర్మాతలు ఆ షెడ్యూల్‌కు ఒప్పుకోలేదని వినికిడి. అయితే ఆ సన్నివేశాలు జపాన్‌లోనే షూట్ చేస్తే సినిమాకు న్యాయం జరుగుతుందని సుజిత్ భావించారట. చివరికి ఎలాగైనా అక్కడే షూట్ చేయాలని ఫిక్స్ అయిన ఆయన, డబ్బుల కోసం తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేశారని టాక్.
ఆ డబ్బుతో జపాన్‌కు వెళ్లి కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ విషయం సినిమా డబ్బింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌కు తెలిసిందట. దర్శకుడు సినిమా కోసం తన సొంత వాహనాన్ని అమ్ముకోవడం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చాలా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. అదే సమయంలో సుజిత్‌కు అదే మోడల్ ల్యాండ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని పవన్ ఫిక్స్ అయ్యారట. అంతేకాదు, ఆ లగ్జరీ కారుకు సంబంధించిన ఈఎంఐలను కూడా పవన్ కళ్యాణే చెల్లిస్తారని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ కథ మొత్తం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది మాత్రం పవన్ కళ్యాణ్, సుజిత్‌లకే తెలియాలి. అయితే ఈ కథ నిజమైతే మాత్రం… పవన్ కళ్యాణ్ గొప్ప మనసుకు, సుజిత్ సినిమా పట్ల చూపిన డెడికేషన్‌కు ఇది మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram