సాయంత్రం 5 గంటలకు జుహూ స్మశానవాటికలో దిలీప్‌కుమార్ అంత్యక్రియలు
విధాత,ముంబై: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ అంత్యక్రియలను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలోని జుహు శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్.. ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. చివరి క్షణాల్లో ఆయన భార్య సైరా బాను ఆయనతోనే ఉన్నారు. దిలీప్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫరూకీయే దిలీప్ ట్విటర్ అకౌంట్ నుంచి ఆయన మరణవార్తతోపాటు అంత్యక్రియల సమాచారాన్ని కూడా అందించారు. ఇండియన్ సినిమా […]
విధాత,ముంబై: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ అంత్యక్రియలను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలోని జుహు శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్.. ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. చివరి క్షణాల్లో ఆయన భార్య సైరా బాను ఆయనతోనే ఉన్నారు. దిలీప్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫరూకీయే దిలీప్ ట్విటర్ అకౌంట్ నుంచి ఆయన మరణవార్తతోపాటు అంత్యక్రియల సమాచారాన్ని కూడా అందించారు.
ఇండియన్ సినిమా లెజెండరీ నటుల్లో దిలీప్ కూడా ఒకరు. 1950, 60ల్లో హిందీ సినిమాను ఆయన ఏలారు. మొఘల్-ఇ-ఆజం, దేవ్‌దాస్, నయా దౌర్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్‌లాంటి మూవీస్‌లో దిలీప్ నటించారు. ఆయనను భారత దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో 2015లో సత్కరించింది భారత ప్రభుత్వం. అంతకుముందు 1991లో పద్మ భూషణ్ అందుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram