Mumbai | అంత్య‌క్రియ‌ల‌కు రాలేద‌ని బిడ్డ‌ను చంపాడు.. త‌ల్లిని గాయ‌ప‌రిచాడు

Mumbai | ఓ వ్య‌క్తి దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న సోద‌రుడి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కాలేద‌ని చెప్పి.. ఓ యువ‌తిని అంత‌మొందించాడు. ఆమె త‌ల్లిని తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఘ‌ట్‌కోప‌ర్ - మ‌న్‌కుర్ద్ లింక్ రోడ్డులో కృష్ణ ప‌వార్ అనే వ్య‌క్తి కుటుంబం నివాసం ఉంటుంది. అయితే కృష్ణ సోద‌రుడు మంగ‌ళ‌వారం చ‌నిపోయాడు. ఇక పొరుగున ఉన్న ఓ త‌ల్లీబిడ్డ‌.. ప‌వార్ సోద‌రుడి అంత్య‌క్రియ‌ల‌కు […]

Mumbai | అంత్య‌క్రియ‌ల‌కు రాలేద‌ని బిడ్డ‌ను చంపాడు.. త‌ల్లిని గాయ‌ప‌రిచాడు

Mumbai | ఓ వ్య‌క్తి దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న సోద‌రుడి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కాలేద‌ని చెప్పి.. ఓ యువ‌తిని అంత‌మొందించాడు. ఆమె త‌ల్లిని తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఘ‌ట్‌కోప‌ర్ – మ‌న్‌కుర్ద్ లింక్ రోడ్డులో కృష్ణ ప‌వార్ అనే వ్య‌క్తి కుటుంబం నివాసం ఉంటుంది. అయితే కృష్ణ సోద‌రుడు మంగ‌ళ‌వారం చ‌నిపోయాడు. ఇక పొరుగున ఉన్న ఓ త‌ల్లీబిడ్డ‌.. ప‌వార్ సోద‌రుడి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కాలేదు. దీంతో కోపం పెంచుకున్న కృష్ణ ప‌వార్.. సోద‌రుడి అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత ఇంటికి వ‌చ్చాడు.

అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకాని ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై గొడ‌వ పెట్టుకున్నాడు. మొద‌ట ఆ మ‌హిళ‌పై ప‌దునైన ఆయుధంతో దాడి చేశాడు. ప‌వార్ నుంచి తల్లిని కాపాడుకునేందుకు 25 ఏండ్ల వ‌య‌సున్న బిడ్డ య‌త్నించింది. ఆమెపై కూడా క‌త్తితో విచక్ష‌ణార‌హితంగా దాడి చేసి చంపాడు. మృతురాలి త‌ల్లి తీవ్రంగా గాయ‌ప‌డి, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది.

ఈ ఘ‌ట‌న‌పై మృతురాలి సోద‌రి అంజ‌లి భోస‌లే డియోన‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. త‌మ సోద‌రిని చంపి, అమ్మ‌ను తీవ్రంగా గాయ‌ప‌రిచిన‌ట్లు ప‌వార్‌పై ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసులో ప‌వార్ దంప‌తుల‌తో పాటు మ‌రో జంట‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు త‌ర‌లించారు.