ఫ్లాప్ అవుతుందని పవన్ కళ్యాణ్ తెలిసి కూడా చేసిన సినిమా ఏదో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇప్పటి వరకు 26 సినిమాలు చేశాడు. అందులో సగం విజయాలు ఉంటే.. సగం పరాజయాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందుగానే తెలిసి ఎవరు ఏ సినిమాకు కమిట్ అవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కెరీర్‌లో ఒక సినిమాను అలాగే చేశాడు. ఆ కథ చెప్పినప్పుడు అది ఫ్లాప్ అవుతుందని అంచనా వేశాడు. కానీ దర్శక నిర్మాతలు కన్విన్స్ చేసి సినిమా చేయించారు. అయితే విడుదలయిన తరువాత […]

ఫ్లాప్ అవుతుందని పవన్ కళ్యాణ్  తెలిసి కూడా చేసిన సినిమా ఏదో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇప్పటి వరకు 26 సినిమాలు చేశాడు. అందులో సగం విజయాలు ఉంటే.. సగం పరాజయాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందుగానే తెలిసి ఎవరు ఏ సినిమాకు కమిట్ అవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కెరీర్‌లో ఒక సినిమాను అలాగే చేశాడు. ఆ కథ చెప్పినప్పుడు అది ఫ్లాప్ అవుతుందని అంచనా వేశాడు. కానీ దర్శక నిర్మాతలు కన్విన్స్ చేసి సినిమా చేయించారు. అయితే విడుదలయిన తరువాత చివరికి పవన్ కళ్యాణ్ అంచనాలు నిజమయ్యాయి. ఆ సినిమా ఫ్లాప్ అయింది.

ఈ విష‌యాన్ని ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి చెప్పాడు. ఆయ‌న చెప్పిన సినిమా ఏదో కాదు.. బంగారం 2006లో విడుదలైన ఈ సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా దారుణంగా నిరాశ పరిచింది. తమిళ దర్శకుడు ధరణి తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. దానికి తోడు సరిగ్గా వారం ముందు పోకిరి సినిమా విడుదల కావడం.. అది బ్లాక్ బస్టర్ కావడంతో బంగారం సినిమా అడ్రస్ గల్లంతు అయిపోయింది. ఫ్యాక్షనిజం బాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా బయ్యర్లకు స్వల్ప నష్టాలు మిగిల్చింది. అయితే ఈ కథ చెప్పినప్పుడు వర్కౌట్ కాదని దర్శకుడు ధరణికి పవన్ చెప్పినట్లు ఆనంద్ సాయి తెలిపాడు. అయితే ఆయన చేతులు పట్టుకొని నన్ను నమ్మి సినిమా చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ముందడుగు వేశాడని తెలిపారు.

కానీ చివరికి పవన్ జడ్జిమెంట్ నిజమైందని ఆనంద్ సాయి తెలిపారు. ఆ సినిమా ముందు నుంచి కూడా ఆడదు అనే ఉద్దేశంతోనే పవన్ ఉన్నాడని.. విడుదల తర్వాత అదే రిజల్ట్ వచ్చిందని చెప్పాడు. అంతేకాదు ప్రతి సారి తన సినిమాలకు విలువైన ఇన్ పుట్స్ ఇస్తుంటారు పవన్. బంగారం సినిమాకు అది కూడా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో ఆయనకు హీరోయిన్ కూడా ఉండదు. దానికి తోడు క్లైమాక్స్ కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. దీంతో బంగారం సినిమా విడుదలైనప్పుడు పవన్ అభిమానులు కూడా కాస్త నిరాశ పడ్డారు.