Jabardasth| కడసారి చూపు కూడా దక్కలేదు.. పక్కకి వెళ్లి గుక్కపెట్టి ఏడ్చానన్న జబర్ధస్త్ కమెడీయన్
Jabardasth| జబర్ధస్త్ షోతో ఇండస్ట్రీకి చాలా మంది కమెడీయన్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు మాత్రమే మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు. వారిలో ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు. వర్షతో కలిసి ఆయన పండించే కామెడీకి ఫ్యాన్ బేస్ చాలా ఉంటుంది. సుధీర్- రష్మీ జంట తర్వాత మళ్లీ అంత హిట్ అ

Jabardasth| జబర్ధస్త్ షోతో ఇండస్ట్రీకి చాలా మంది కమెడీయన్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు మాత్రమే మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు. వారిలో ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు. వర్షతో కలిసి ఆయన పండించే కామెడీకి ఫ్యాన్ బేస్ చాలా ఉంటుంది. సుధీర్- రష్మీ జంట తర్వాత మళ్లీ అంత హిట్ అయిన పెయిర్ ఇమ్మాన్యుయేల్- వర్షది. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని నెట్టింట ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా సందడి చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం గంగం గణేశా. ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్మాన్యుయేల్ హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. మే 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండతో పాటు ఇమ్మాన్యుయేల్ కూడా ప్రమోషనల్ కార్యక్రమాలలో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయేల్ తన జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటనని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. స్కిట్ చేస్తున్న సమయంలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. నాన్న కాల్ లో తాత చనిపోయాడు. ఇంటికి రమ్మని అన్నాడు. తాత అంటే చాలా ఇష్టం. వెళ్లాలని ఉన్నా కూడా స్కిట్ మధ్యలో వదిలేసి వెళ్ళలేను. అప్పుడు స్టేజి వెనక్కి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చి కళ్ల నీళ్లు తుడుచుకొని స్కిట్ చేశాను.
అయితే ఆ స్కిట్ బాగా వచ్చింది. నా కెరీర్ బెస్ట్ స్కిట్స్ లో ఒకటిగా మారింది. ఇక స్కిట్ అయ్యాక ఇంటికి బయల్దేరాను. నేను వెళ్ళేసరికే తాత అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన చివరి చూపు కూడా దక్కలేదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే గతంలో ఇమ్మానుయేల్ ఇక లేడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ చూశారు. ఇవి చూసి షాకైన ఇమ్మానుయేల్ తాజాగా వీటిపై సెటైరికల్‌గా స్పందించాడు. అరే చేతకాని కొడుకులు.. నేను నటనం చేస్తే చచ్చిపోయానని రాశారంట.. నా నటనంరా అది నా నటనం.. చచ్చిపోలేదు నేను.. ఇట్టాంటోళ్లను ఏమంటారో తెలుసా.. చేతకాని కొడుకులు అంటారు.. నా వీడియో ఎక్కడి దాకా వచ్చిందో కింద కామెంట్ చేయండి.. అరే బాబు నేను చావలేదురా నాయనా.. ప్రేమ వాలంటీర్‌లో సీన్‌రా అది ..” అంటూ సరదాగానే స్పందించాడు ఇమ్మానుయేల్