Jabardasth| వర్షను బ్లాక్ మెయిల్ చేసిన ఇమ్మాన్యుయేల్.. చెప్పినట్టు వినకపోతే అంతే..!
Jabardasth| బుల్లితెరపై కొన్ని జంటలకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ జంటలలో వర్ష-ఇమ్మాన్యుయేల్ జంట ఒకటి. జబర్ధస్త్ షో ద్వారా ఈ జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఇద్దరు కలిసి సందడి చేస్తుంటారు. ఇమ్మాన్యుయేల్‌కి ఇంత పేరు రావడానికి వర్ష ఓ కారణం అయితే వర్షకి పేరు రావడానికి ఇమ్మాన్యుయేల్ కూడా ఓ కారణం అని చెప్పాలి. సుధీర్- రష్మీ తర్వాత ఈ జంట అందరి దృష్టిని

Jabardasth| బుల్లితెరపై కొన్ని జంటలకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ జంటలలో వర్ష-ఇమ్మాన్యుయేల్ జంట ఒకటి. జబర్ధస్త్ షో ద్వారా ఈ జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఇద్దరు కలిసి సందడి చేస్తుంటారు. ఇమ్మాన్యుయేల్‌కి ఇంత పేరు రావడానికి వర్ష ఓ కారణం అయితే వర్షకి పేరు రావడానికి ఇమ్మాన్యుయేల్ కూడా ఓ కారణం అని చెప్పాలి. సుధీర్- రష్మీ తర్వాత ఈ జంట అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. లవ్ ట్రాక్‌లు, పెళ్లిళ్లు, కొట్లాటలు, తిట్టుకోవడాలు ఇలా ఒకటేంటి ఈ జంట మీద చాలానే ప్లాన్ చేస్తుంటారు . అయితే ఇమ్మానియేల్ ప్రస్తుతం జబర్దస్త్ టీం లీడర్‌గా ఉన్నాడు. వర్ష అతడి టీమ్‌లోనే చేస్తుంది.
తాజాగా జబర్ధస్త్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో వర్షని ఇమ్మాన్యుయేల్ బెదిరించడం హాట్ టాపిక్‌గా మారింది.తాను చెప్పినట్లు వినకపోతే నెక్ట్స్ స్కిట్‌లో ఛాన్స్ ఉండదని అన్నాడు ఇమ్మానియేల్. అయితే అతను వర్షని బెదిరించడం కామెడీ అనిపించలేదు. నిజంగానే ఆమెని బెదిరించాడా, లేకుంటే స్కిట్‌లో భాగమా అనేది ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక కాని తెలియదు. ఇక ఇదే ప్రోమోలో ఇమ్ము.. వెంకీ మంకీపై సెటైర్స్ వేశాడు. టీం లీడర్ లేనోడా అంటూ వెంకీని అనగానే.. వెంకీ సైతం టీం లీడర్ ఉన్నా నన్ను పిలుచుకున్నోడా అంటూ కౌంటర్ వేశాడు.
అంతలో వర్ష వచ్చి.. మామయ్య అంటూ వెంకీ కాళ్లు మొక్కుతుంది. ఇటు ఇమ్మానియేల్ కాలికి మొక్కుతుంది. అప్పుడు ఇలాగే ఉండమ్మా కాసేపు అనగానే.. ఏంటీ అంతసేపా అని వెంకీ అడుగుతాడు. నెక్ట్స్ స్కిట్‌లో పెట్టను అంటూ వర్షకు చిన్న జర్క్ ఇచ్చాడు ఇమ్మానియేల్. ఈ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే వర్ష, ఇమ్మాన్యుయేల్ పెళ్లి చేసుకోబోతున్నారని వారిద్దరు ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ కూడా ప్రచారాలు సాగాయి. దానిపై అయితే క్లారిటీ లేదు.