Jamtara 2 Actor Sachin Chandwade : బాలీవుడ్ యువ నటుడు సచిన్ చాంద్‌వడే ఆత్మహత్య
యువ నటుడు సచిన్ చాంద్‌వడే మృతి బాలీవుడ్‌కి షాక్ ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మొదలైన అతని ప్రయాణం ఎలా విషాదంగా మారిందో తెలుసుకోండి.
విధాత : బాలీవుడ్‌లో విషాదం ఘటన నెలకొంది. యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ఉందిర్‌ఖేడ్‌లో తన ఇంట్లో సచిన్ ఈ నెల 23న సూసైడ్‌కు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఉండగానే..చికిత్స పొందుతూనే సచిన్ ఈ నెల 24న మృతి చెందినట్టు సమాచారం. సచిన్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సచిన్.. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ‘జాంతాఢా 2’ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.
సచిన్ చనిపోవడానికి కేవలం ఐదు రోజుల ముందు, తన రాబోయే మరాఠీ చిత్రం ‘అసుర్వన్’ మోషన్ పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. సచిన్ రామచంద్ర అంబత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా మొయిలీ, అనుజ్ ఠాకరే నటించారు. ఈ చిత్రం ఈ సంవత్సరం చివర్లో విడుదల కావాల్సి ఉంది. గతంలో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అత్మహత్య, దివ్యభారతి మరణాలు బాలీవుడ్ ను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. తాజాగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు సచిన్ చాంద్ వాడే ఆత్మహత్య బాలీవుడ్ ను దిగ్బ్రాంతికి గురి చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram