Viral Song: ట్రెండింగ్‌లో.. ఏమి మాయ ప్రేమలోన ఆల్బమ్
అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన రొమాంటిక్ మ్యూజిక్ వీడియో ‘ఏమి మాయ ప్రేమలోన’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా మ్యూజిక్ వీడియో ‘ఏమి మాయ ప్రేమలోన’ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అనిల్ ఇనమడుగు హీరోగా, వేణి రావ్ హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ హృదయాలను తాకుతోంది. అయితే.. ప్రత్యేకంగా ఈ పాటకు లిరిక్స్ రాయడంతో పాటు దర్శకత్వం కూడా అనిల్ ఇనమడుగే వహించడం విశేషం.
మార్క్ ప్రశాంత్ అందించిన మెలోడియస్ సంగీతం కూడా ఈ పాటకు ప్రాణం పోసింది. దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య తమ మధుర స్వరాలతో ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దారు. ప్రతి లైన్, ప్రతి బీట్‌లో ప్రేమ భావోద్వేగం పాటకు ప్రాణం పోశాయి.
కథ పరంగా చూస్తే.. కేరళలో టూరిస్టు గైడ్‌గా పనిచేసే ఓ యువకుడి జీవితంలోకి, మేఘాల మధ్య మెరుపులా ప్రవేశించిన ఓ అమ్మాయి ప్రేమ ఎలా మార్పు తెచ్చింది? అనే సున్నితమైన కాన్సెప్ట్‌తో ఈ సాంగ్ రూపొందించబడింది. దసరా కానుకగా విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది.
ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. కేరళ అందాలను అద్భుతంగా చూపించిన కెమెరామన్ శ్రవణ్ పనితనం గురించి ఎంతైనా చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమ్ విజువల్‌గా రిచ్‌గా, కళ్లకు హాయిగా అనిపించేలా తీర్చిదిద్దారు. అనిల్, వేణి రావ్ జోడీ తెరపై సహజమైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు.
యంగ్ ప్రొడ్యూసర్లు అజయ్‌కుమార్ ఇనమడుగు, విష్ణు పాదర్తి ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సక్సెస్‌తో ఈ బ్యానర్ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ రానున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram