Janhvi Kapoor | అలనాటి అందాలతార శ్రీదేవి (Sridevi) తనయ జాన్వీకపూర్ (Janhvi Kapoor). తల్లి నటనా వారసత్వం నుంచి సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా 2018లో ధడక్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర (Devara) లో నటిస్తున్నది. రెండు భాగాలుగా దేవర తెరకెక్కుతుండగా.. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కాబోతున్నది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాల్లో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది.
రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వస్తున్న మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ మూవీ షూటింగ్ కార్యక్రమం లాంఛనంగా ఇటీవల మొదలయ్యాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తున్నది. వరుస రెండు సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ పారితోషకం సైతం పెంచేసినట్లు తెలుస్తున్నది. న్యాచురల్ స్టార్ నానీ (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో మరో సినిమా రానున్నది. ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని నిర్మాతలు భావించారట. అయితే, జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ తెలుసుకొని షాక్ అయ్యారట. దేవర మూవీ కోసం రూ.5కోట్లు తీసుకుందని సమాచారం. రామ్ చరణ్ మూవీకి రూ.6కోట్ల వరకు తీసుకుంటుందని టాక్.
ప్రస్తుతం రూ.10కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజమున్నది తెలియదు. దాంతో ఆ ఆలోచనను మానుకొని మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. జాన్వీ కపూర్ స్థానంలో మిడ్‌రేంజ్‌లో ఓ హీరోయిన్‌ని తీసుకోవాలని భావిస్తున్నారని టాక్. నాని చివరిసారిగా ‘సరిపోదా శనివారం’ మూవీలో కనిపించాడు. త్వరలోనే శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న హిట్-3 షూటింగ్‌లో పాల్గొనున్నాడు. శ్రీకాంత్ ఓదెల చిత్రం 2025 జనవరి నుంచి షూటింగ్ మొదలవనున్నది. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవరలో ‘తంగం’ పాత్రలో కనిపించనున్నది. రామ్‌చరణ్ సినిమాతో పాటు బాలీవుడ్‌లో సన్నీ సంస్కారీ కి తులసి కుమారి మూవీలో నటిస్తున్నది. ఈ చిత్రం 2025 ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నది.