Kriti Sanon At World Health Summit in Berlin | ప్రపంచ ఆరోగ్య సదస్సులో మెరిసిన కృతి సనన్
నటి కృతి సనన్ బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్-2025కు హాజరై, అక్కడ ప్రసంగించిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ దేశాలు మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించి, లింగ సమానత్వం కోసం నిధులు పెంచాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు.

విధాత : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ బెర్లిన్‌లో నిర్వహించిన వరల్డ్ హెల్త్ సమ్మిట్- 2025కు హాజరై చరిత్ర సృష్టించారు. ఈ సదస్సులో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతిసనన్ నిలిచారు. సదస్సులో కృతి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ వారి వైద్యానికి సరిపడినన్ని నిధులు ప్రభుత్వాలు కేటాయించడం లేదన్నారు. మహిళల ఆరోగ్యమనేది తేలిగ్గా తీసుకునే అంశం కాదని, మానవాళి భవిష్యత్తుకు మూలస్తంభం లాంటిదని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యంతో పాటు లింగ సమానత్వం కోసం అధిక నిధులు వెచ్చించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. కృతి సెప్టెంబరులో‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్’ ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపికవ్వడం గమనార్హం.
ప్రస్తుతం కృతి సనన్ తమిళ హీరో ధనుష్ తో ‘తేరే ఇష్క్ మే’ అనే లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందించిన సినిమాలో నటించారు. ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. కృతి, షాహిద్ కపూర్‌తో లు నటించిన ‘కాక్‌టెయిల్ 2’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.