Gujarat Cabinet Expansion On Oct 17 | గుజరాత్‌లో సీఎం మినహా మంత్రుల రాజీనామా: అక్టోబర్ 17న కొత్త మంత్రుల ప్రమాణం
గుజరాత్‌లో సీఎం భూపేంద్ర పటేల్ మినహా కేబినెట్‌లోని 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 17న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించనున్నారు. దీంతో ఆయన మినహా ఆయన కేబినెట్‌లోని 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఈ నెల 17న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు వీలుగా మంత్రులు రాజీనామా చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో న్యూఢిల్లీలో ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత గుజరాత్ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణపై సీఎం భూపేంద్ర పటేల్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నాడు పదిమంది కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరు తిరిగి కేబినెట్ లో బెర్త్ దక్కించుకొనే అవకాశం ఉంది. రిషికేష్ పటేల్, ధర్మేంద్రసిన్హా, భూపేంద్రసిన్హా కు తిరిగి కేబినెట్లో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కనుబాయ్ దేశాయ్, రాఘవ్ జీ పటేల్, కనర్వజీ భవాలియా, మురుభాయ్ బేలాలకు తిరిగి అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రితో పాటు గుజరాత్ కేబినెట్ లో 17 మంది ఉన్నారు. ఎనిమిది మంది మంత్రులకు కేబినెట్ ర్యాంక్. మిగిలిన వారంతా సహాయ మంత్రులు . గతంలో గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్థానంలో జగదీశ్ విశ్వకర్మకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. విశ్వకర్మ రాష్ట్ర సహాయ మంత్రిగా ఉన్నారు. 2022 డిసెంబర్ 12న గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram