Apiculture | తేనెటీగ‌ల పెంప‌కంతో ఏడాదికి రూ. 40 ల‌క్ష‌ల సంపాద‌న‌..!

Apiculture | సినీ రంగాన్ని వ‌దిలేసి.. వ్య‌వసాయ రంగం( Agriculture )లోకి అడుగుపెట్టిన ఓ యువ ఎడిట‌ర్ ఏడాదికి ల‌క్ష‌ల రూపాయాలు సంపాదిస్తున్నాడు. ఎపిక‌ల్చ‌ర్‌( Apiculture )తో ఏడాదికి రూ. 40 ల‌క్ష‌లు సంపాదిస్తూ.. నేటి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. మ‌రి యువ రైతు( Young Farmer ) గా మారిన ఎడిట‌ర్ గురించి తెలుసుకోవాలంటే గుజ‌రాత్( Gujarat ) వెళ్ల‌క త‌ప్ప‌దు.

  • By: raj |    agriculture |    Published on : Dec 16, 2025 8:20 AM IST
Apiculture | తేనెటీగ‌ల పెంప‌కంతో ఏడాదికి రూ. 40 ల‌క్ష‌ల సంపాద‌న‌..!

Apiculture | గుజ‌రాత్( Gujarat ) రాజ్‌కోట్‌( Rajkot )లోని గోండ‌ల్ గ్రామానికి( Gondal Village ) చెందిన బ్రిజేష్ బి క‌లారియా( Brijesh B Kalaria ).. కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత పుణెలో యానిమేష‌న్, సినిమా ఎడిటింగ్‌కు సంబంధించిన కోర్సు చేశాడు. అనంత‌రం ముంబైలోని గ్లోబ‌ల్ మీడియా, ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌ర్వీసెస్ కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది. ఓ ఏడాది పాటు ఉద్యోగం చేశారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చొని సినిమాలు ఎడిట్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇది అత‌ని జీవితం కాద‌నుకున్నాడు బ్రిజేష్. నాన్న సాగు చేసే ప‌త్తి( Cotton ), వేరుశ‌న‌గ( Ground Nut ) పొలంలో స‌మ‌యం గ‌డ‌ప‌డం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంద‌ని బ్రిజేష్ గ్ర‌హించాడు. దీంతో ఉద్యోగం మానేసి ఇంటి బాట ప‌ట్టాడు.

ఇక గోండ‌ల్ గ్రామానికి తిరిగొచ్చిన బ్రిజేష్.. వ్య‌వ‌సాయంపై దృష్టి సారించాడు. తండ్రి వ్య‌వ‌సాయంలో ఎంతో క‌ష్ట‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. లాభాలు పెద్ద‌గా లేవు. ఈ క్ర‌మంలో త‌మ‌కున్న భూమిలో ఎక్కువ దిగుబ‌డి, లాభాలు వ‌చ్చే పంట‌ల‌పై బ్రిజేష్ దృష్టి పెట్టాడు. ఈ ఆలోచ‌న‌ల నుంచి పుట్టిందే ఎపిక‌ల్చ‌ర్( Apiculture ). అదే తేనెటీగ‌ల పెంప‌కం.

తేనెటీగల పెంపకం ఎందుకు..?

ఇక బ్రిజేష్ తేనెటీగ‌ల పెంపకం ఎందుకు ఎంచుకున్నాడంటే.. ఎపిక‌ల్చ‌ర్‌కు ఎక్కువ‌గా భూమి అవ‌స‌రం లేదు. వీటికి ఉప‌యోగించే పెట్టెల‌ను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి సుల‌భంగా త‌ర‌లించొచ్చు. అద‌న‌పు ఆదాయం సంపాదించ‌డానికి కూడా ఇది ఒక మంచి మార్గ‌మ‌ని భావించాడు బ్రిజేష్. ఈ క్ర‌మంలో 2016లో తేనెటీగ‌ల పెంప‌కాన్ని ప్రారంభించాడు. స‌మీప గ్రామంలోని తేనెటీగ‌ల పెంప‌కందారుడి నుంచి 10 తెనేటీగ‌ల పెట్టెల‌ను కొనుగోలు చేశాడు. ఒక్కో పెట్టె ఖ‌రీదు రూ. 4 వేలు. ఎలాంటి శిక్ష‌ణ లేకుండానే ఎపిక‌ల్చ‌ర్ చేయ‌డం మొద‌లుపెట్టాడు.

ఇక తేనెటీగ‌ల పెట్టె నుంచి రెండు నెల‌ల కంటే త‌క్కువ స‌మ‌యంలోనే తేనెను సేక‌రించేందుకు బ్రిజేష్ సిద్ధ‌మ‌య్యాడు. 40 రోజుల్లో 18 కిలోల తేనె( Honey )ను సేక‌రించాడు. స్థానిక మార్కెట్‌లో కిలో తేనెను రూ. 500 చొప్పున విక్ర‌యించాడు యువ రైతు. అలా రూ. 9 వేల వ‌ర‌కు ఆదాయం వ‌చ్చింది.

10 పెట్టెల నుంచి 50 పెట్టెల‌కు విస్త‌ర‌ణ‌

త‌న ఎపిక‌ల్చ‌ర్‌ను 10 పెట్టెల నుంచి 50 పెట్టెల‌కు విస్త‌రించాడు బ్రిజేష్. రాణి తేనెటీగ నిరంతరం గుడ్లు పెట్టడం వల్ల ఒక సమూహంలోని తేనెటీగల సంఖ్య పెరుగుతుంది. నేను ఆరు నెలల్లో 10 పెట్టెలను 50 పెట్టెల తేనెటీగలుగా పెంచాను. వాటి నుండి కూడా తేనెను సేకరించిన‌ట్లు బ్రిజేష్ పేర్కొన్నాడు. ఎపిక‌ల్చ‌ర్‌కు ప్ర‌భుత్వం నుంచి 50 శాతం స‌బ్సిడీ ల‌భించింది. వాము పొలాల్లో తేనెటీగ‌ల పెట్టెల‌ను ఉంచ‌డం మొద‌లుపెట్టాడు. తేనెటీగ‌లు వాము పువ్వుల మ‌కరందాన్ని సేక‌రించడంతో ఆ తేనె మ‌రింత ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. వాము తేనె యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్, యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాలు క‌లిగి ఉంటుంది. దీంతో దానికి మ‌రింత డిమాండ్ ఉంది. భారీగా లాభాలు కూడా గ‌డించిన‌ట్లు బ్రిజేష్ తెలిపాడు.

ఏడాదికి రూ. 40 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్‌

2016లో రాజ్‌కోట్‌లో జ‌రిగిన ఓ ఎగ్జిబిష‌న్‌లో బ్రిజేష్ పాల్గొన్నాడు. ఆ ఎగ్జిబిష‌న్‌లో తేనెను విక్ర‌యించాడు. బ్రిజేష్ తేనెకు భారీగా డిమాండ్ వ‌చ్చింది. దాంతో ప్ర‌తి ఏడాది ఎగ్జిబిష‌న్‌లో పాల్గొని త‌మ తేనేను విక్ర‌యించ‌డం ప్రారంభించాం. దాంతో ఊహించ‌ని రీతిలో అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరింది. ఇలా ఏడాదికి 5 వేల కిలోల తేనెను విక్ర‌యిస్తున్నాడు. కిలో తేనెను రూ. 800కు అమ్ముతున్నాడు. మొత్తంగా ఏడాదికి రూ. 40 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగాడు బ్రిజేష్.

Read Also |

Voyager Station | అంతరిక్షంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌.. ఎప్పుడు? ఎలా వెళ్లాలి?
UK Visa | యూకే వీసా నిబంధనలు కఠినతరం: 67శాతం పడిపోయిన నియామకాలు
Dowry Harassment | అదనపు కట్నం అడిగారని పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న వధువు.. యూపీలో ఘటన (Viral Videos)