• Telugu News
  • /National

VK Sasikala New Party | తమిళనాడులో శశికళ కొత్త పార్టీ ప్రారంభం

తమిళనాడులో శశికళ కొత్త రాజకీయ పార్టీ ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవార్ మక్కల్ మునేట్ర కజగం’ ప్రారంభించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 13, 2026, 1:17 pm IST
Read Time: 5 mins
VK Sasikala New Party | తమిళనాడులో శశికళ కొత్త పార్టీ ప్రారంభం

విధాత : తమిళనాడు రాజకీయ వేదికపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. దివంగత మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత జయలలిత సన్నిహితురాలు,అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ శుక్రవారం కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తమిళనాడులో మరికొన్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న వేళ.. శశికళ కొత్త పార్టీని ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.

శశికళ తన కొత్త పార్టీ పేరును ‘ఆల్‌ ఇండియా పురచ్చి తలైవార్‌ మక్కల్‌ మునేట్ర కజగం’గా వెల్లడించారు. కొబ్బరి చెట్టు తోటను పార్టీ గుర్తుగా ప్రకటించారు. పార్టీ అనుచరులతో కలిసి మీడియా ఎదుట శశికళ కొత్త పార్టీ వివరాలు వెల్లడించారు. ఇటీవల జయలలిత 75 జయంతి సందర్భంగా రామనాథపురంలో నిర్వహించిన సభలో శశకళ పార్టీ జెండా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్‌ గుర్తులతో జెండా ఉంది. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని శశికళ ఈ సందర్బంగా పేర్కొన్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. నా పార్టీ ప్రత్యర్థులను, ద్రోహులను తప్పక ఓడిస్తుంది. మనం రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని చూడబోతున్నాం’ అని శశికళ తెలిపారు.

జయలలితకు 30 యేళ్లకు పైగా అత్యంత సన్నిహితంగా ఉన్న శశికళ..ఆమె పాలనలో తెరవెనక శక్తివంతమైన వ్యక్తిగా కొనసాగారు. 2016 డిసెంబర్ లో జయలలిత మరణానంతరం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన శశికళ..అన్నా డీఎంకే ప్రధాని కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం జరగిన పరిణామాలతో శశికళజైలు జీవితం అనుభవించారు.

తమిళనాడులో ఇదివరకే సినీ స్టార్ విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ కొత్త పార్టీ ఎంట్రీతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారిపోయాయి. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ రాజకీయాల్లో దళపతి విజయ్ కొత్త మలుపు తిప్పుతారని అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మూడో ప్రధాన రాజకీయ శక్తిగా విజయ్ టీవీకే అవతరించవచ్చన్న ప్రచారం మధ్య.. శశికళ కొత్త పార్టీ రానున్న ఎన్నికల్లో ఏ పార్టీని దెబ్బతీస్తుందోనన్న టెన్షన్ తమిళ రాజకీయాల్లో మొదలైంది.

ఇవి కూడా చదవండి :

దానంకు క్లీన్ చీట్ పై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ!
Sunrisers Leeds X Account Suspended | సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కావ్య పాపకు ఎక్స్ షాక్ !