రేపే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన..పార్టీ పేరుపై సస్పెన్స్!
కల్వకుంట్ల కవిత రేపు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ పేరు, జెండా, అజెండాపై ఉత్కంఠ నెలకొనగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి పెరిగింది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరును రేపు ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్‌లో అధ్వయ కన్వెన్షన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు శనివారం ఉదయం పది గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఇదే వేదిక నుంచి పార్టీ పేరు, పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు.
కవిత పార్టీ పేరుపై కొనసాగుతున్న సస్పెన్స్
కవిత పెట్టబోయే రాజకీయ పార్టీ పేరు ఏమిటన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. సర్వోదయ తెలంగాణ, తెలంగాణ ప్రజా వికాస్ సమితి, తెలంగాణ ప్రజా జాగృతి పేర్లలో ఒకటి ఆమె పార్టీ పేరు కావచ్చని అంటున్నారు. సభా ప్రాంగణం వద్దతె లంగాణ ప్రజావికాస్ సమితి స్వాగతం అంటూ బోర్డులు ఏర్పాటు కావడం గమనార్హం. అయితే ‘సర్వోదయ తెలంగాణ’ పేరు ఖరారైనట్లు సమాచారం. గతంలో సర్వోదయ తెలంగాణ కోసం తమ పార్టీ పని చేస్తుందని కవిత తెలిపారు. తెలంగాణ జాగృతినే మన రాష్ట్ర ప్రాంతీయ పార్టీగా, ప్రతి ఒక్కరి ఇంటి పార్టీగా ఉంటుందన్నారు. తెలంగాణ భవిష్యత్ ను మార్చే దారి దీపంలా జాగృతి పార్టీ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరుతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత పార్టీ ఏదైనా పార్టీ పేరులో మాత్రం తెలంగాణ పదం ఖచ్చితంగా ఉంటుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు.
పార్టీ ఆవిర్భావ సభకు భారీగా జన సమీకరణ
కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తుంది. సభకు వేలాది మంది ఉద్యమకారులు, ఎన్జీవోలు, పలువురు మేధావులు హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని భావిస్తున్నారు. కవిత ప్రారంభించనున్న కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారు? బీఆర్‌ఎస్ నుంచి ఎవరు వెళ్తారు? అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కవిత పార్టీ ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ఆమె పార్టీతో ఎవరికి నష్టం? అనే దానిపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఉద్యమ కారులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు బీఆర్‌ఎస్ సహా.. వివిద పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరనున్నట్లు జాగృతి ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుంది : ఎంపీ ఈటల రాజేందర్
ఆమె 2.06మీటర్లు..ఆయన 1.62మీటర్లు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram