• Telugu News
  • /Telangana

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Apr 24, 2026, 1:53 pm IST
Read Time: 3 mins
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా

విధాత: ఆత్మహత్య చేసుకున్న నర్సాపూర్ ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపింది. ప్రభుత్వం తరుపున ఆర్డీవో ఉమారాణి శంకర్ గౌడ్ అంత్యక్రియాల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా, సహాయం వివరాలను వెల్లడించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా రూ.5 లక్షల సహాయం ప్రకటించారు.

శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వద్దకు తరలించేందుకు ప్రయత్నం..ఉద్రిక్తత

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించి అక్కడ నివాళులు అర్పించేందుకు ఆర్టీసీ జేఏపీ నాయకులు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీఆర్ఎస్ నేతలు కార్మికులకు మద్దతుగా నిలవడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది.

ఇవి కూడా చదవండి :

ఆర్టీసీ సమ్మెలో విషాదం..డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..ఉద్రిక్తత
తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రతీరెడ్డి