Kushboo|పెద్ద బాంబ్ పేల్చిన ఖుష్బూ.. మా నాన్నే నా పై లైంగిక వేధింపులు!

Kushboo| ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ సుంద‌ర్ ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో క‌నిపిస్తూ మెప్పిస్తుంది. ఖుష్బూ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది. ఖుష్బూ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించిన విష‌యం

  • By: sn    cinema    Aug 29, 2024 7:20 AM IST
Kushboo|పెద్ద బాంబ్ పేల్చిన ఖుష్బూ.. మా నాన్నే నా పై లైంగిక వేధింపులు!

Kushboo| ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ సుంద‌ర్ ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో క‌నిపిస్తూ మెప్పిస్తుంది. ఖుష్బూ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది. ఖుష్బూ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.తెలుగులో చిరంజీవి, వెంక‌టేష్ వంటి హీరోల‌తో క‌లిసి న‌టించి అల‌రించింది. అయితే ఖుష్బూ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా ప్ర‌త్యేక రోల్స్ లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. ఇటీవల ఆమె నటించి నిర్మించిన అరణ్మనై 4 సినిమా ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. మరోవైపు పాలిటిక్స్ లోనూ బిజీ బిజీగా ఉంటున్నారు ఖుష్బూ. కాగా ఖుష్బూ తాజాగా త‌న తండ్రి గురించి షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఖుష్బూ. ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ఆమె చెప్పుకొచ్చింది. మన చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరంగా ఉంద‌ని ఖుష్బూ అన్నారు. అయితే వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలను మెచ్చుకోవాలి. వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్‌ ఎంతో ఉపయోగపడింది అని అన్నారు.. లైంగిక వేధింపులుమహిళలకు అన్ని రంగాల్లోనూ ఎదురవుతున్నాయి. పురుషులకూ ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఎక్కువగా వేధింపులు ఎదుర్కొనేది స్త్రీలే. ఈ విషయంపై నా కుమార్తెలతోనూ సవివరంగా చర్చించాను.

బాధితులకు మన సపోర్ట్‌ ఎంతో అవసరం. వారి బాధను మనం వినాలి. మానసికంగా వారికి ధైర్యం చెప్పాలి. సమస్య ఎదురైనప్పుడే వారెందుకు మాట్లాడలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి చెప్పే ధైర్యం అందరికీ ఉండదు కదా. తండ్రి వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు అంత సమయం తీసుకున్నావు? అని చాలామంది గతంలో నన్ను అడిగారు. నిజమే.. నేను ముందే మాట్లాడాల్సింది. ఆ ఘటన కెరీర్‌ విషయంలో జరిగింది కాదు. నన్ను రక్షించాల్సిన వ్యక్తి నుంచే నేను వేధింపులు ఎదుర్కొన్నాన‌ని ఖుష్బూ తెలియ‌జేసింది. చాలామంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని ప్ర‌తి ఒక్క‌రం అర్ధం చేసుకోవాలి. మ‌హిళ‌ల‌కి అండ‌గా నిల‌వండి అదే నేనే పురుషుల‌కి చెప్పేది. మీ ప్రేమ‌, మ‌ద్ద‌తు వారికి అందించండి అని ఖుష్బూ స్ప‌ష్టం చేశారు