Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే బెటర్..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంతానం పురోగతి సంతృప్తి కలిగిస్తుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ రోజు ఫలవంతమైన రోజు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. పితృవర్గం నుంచి ఆర్థిక లబ్ది ఉండవచ్చు. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరిస్తే అధిక లాభాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో చక్కగా రాణిస్తారు. సన్నిహితుల నుంచి ఆర్థికలబ్ధి ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో పనిభారం, ఒత్తిడి పెరగవచ్చు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఆటంకాలు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం అధిక వ్యయం చేస్తారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలం. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు, ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి ఈ రోజు మంచి రోజు. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. మీ ప్రతిభతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. శత్రుభయం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సంపద, సౌఖ్యం మెండుగా లభిస్తాయి. వ్యాపారులు కృషికి తగిన ప్రతిఫలాలను, లాభాలను అందుకుంటారు. ప్రియమైనవారితో విహార యాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రారంభించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలున్నా సర్దుకుంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి.
ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో అందరినీ కలుపుకొని పోవడం వలన సమస్యలుండవు. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో మెలిగితే ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.