Mehreen| ఎఫ్2 బ్యూటీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది మెగా హీరో కోసమా.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్త
Mehreen| కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. ఆ తర్వాత చాలా మంది హీరోలతో కలిసి నటించి మెప్పించింది.ఆ తర్వాత చాలా మంది స్టార్స్‌తో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకుంది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమా

Mehreen| కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్(Mehreen). ఆ తర్వాత చాలా మంది హీరోలతో కలిసి నటించి మెప్పించింది.ఆ తర్వాత చాలా మంది స్టార్స్‌తో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకుంది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకోవడంతో ఈ అమ్మడి కెరీర్ మరింత దూసుకుపోతుందని అందరు భావించారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే 2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్(Bhavya Bishnoi)తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది.ఇక పెళ్లి మిగిలింది అనుకున్న సమయంలో ఎందుకో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.
ఆ తర్వాత మెహ్రీన్ తన గ్లామర్‌పై దృష్టి పెట్టింది. సినిమాలు చేసుకుంటూ పోతుంది. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ కేక పెట్టించింది. మెహ్రీన్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం వెనక అనేక ప్రచారాలు సాగుతున్నాయి.ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఓ సీనియర్ హీరోనే అని.. సీనియర్ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. కట్ చేస్తే ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోసం ఆమె తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందంటూ ఓ టాక్ నడుస్తుంది. మెహ్రీన్, సాయిధరమ్ తేజ్ కలిసి జవాన్ అనే సినిమాలో నటించారు. అందులో ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు.
మరి కొద్ది రోజులలో మెహ్రీన్, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ప్రచారాలు సాగుతున్నాయి. మరి దీనిపై క్లారిటీ అయితే రావలసి ఉంది. కాగా,30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాలని భద్రపరచుకొని, కావలసినప్పుడు పిల్లలికనే ప్రాసెస్ ఎగ్ ఫ్రీజింగ్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్టు ఇటీవల తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది.