Foreign Women Street Fight | విదేశీ మహిళల వీధి యుద్దం..వైరల్

విదేశీ మహిళల మధ్య వీధిలో జరిగిన ఘర్షణ వైరల్ అయింది. నల్లజాతి మహిళలు, శ్వేతజాతీ మహిళలు ఒకరికొకరు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వర్ణ వివక్ష కారణంగా ఈ ఘర్షణ జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.

Foreign Women Street Fight | విదేశీ మహిళల వీధి యుద్దం..వైరల్

విధాత: విదేశీ మహిళల మధ్య తగువు ఎందుకొచ్చిందో గాని..పరస్పరం రెచ్చిపోయి కొట్టుకున్నారు. వీధిలోనే పొర్లాడుతూ ఒకరికొకరు జుట్లు పట్టుకుని సిగపట్ల యుద్దం చేయడంతో పాటు పిడిగుద్దులు విసురుకున్నారు. శ్వేతజాతి మహిళపై ఓ నల్లజాతి మహిళ దాడికి పాల్పడగా వారి స్ట్రీట్ ఫైట్ ను ఆపేందుకు వచ్చిన మరో శ్వేత జాతి మహిళపై ఇంకో నల్లజాతి మహిళ దాడికి పాల్పడింది. నల్లజాతి మహిళల దాడిని ఎదుర్కోవడంలో శ్వేతజాతి మహిళలు చేసిన పోరాటం ఫలించలేదు.

వారి మధ్య ఘర్షణను అక్కడి వారు చూసినప్పటికి ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. బాధిత శ్వేత జాతి మహిళల పెడబొబ్బలతో చివరకు ఓ వ్యక్తి జోక్యం చేసుకుని వారిని విడిపించారు. ఘర్షణలో శ్వేత జాతి మహిళలు గాయపడ్డారు. ఈ ఘటన బహుశ వర్ణ వివక్షత నేపథ్యంలో చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్నారు. తరుచు ఆఫ్రికా, యూరఫ్ దేశాల్లో ఈ తరహా ఘర్షణలు తలెత్తడం ఆందోళన కరంగా మారింది.