24 Transgenders Attempt Suicide | షాకింగ్.. ఒకేసారి 24 మంది ట్రాన్స్‌జెండర్ల సామూహిక ఆత్మహత్యాయత్నం

సహచర ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని నందలాల్‌పూర్‌లో 24 మంది ట్రాన్స్‌జెండర్లు ఫ్లోర్ క్లీనర్‌ తాగి సామూహిక ఆత్మహత్యాయత్నం చేశారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉంది.

24 Transgenders Attempt Suicide | షాకింగ్.. ఒకేసారి 24 మంది ట్రాన్స్‌జెండర్ల సామూహిక ఆత్మహత్యాయత్నం

విధాత : సహచర ట్రాన్స్ జెండర్ పై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేయాలన్న డిమాండ్ తో 24మంది ట్రాన్స్ జెండర్లు ఒకేసారి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లోని నందలాల్ పూర్ లో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం అక్షయ్ కుమార్, పంకజ్ జైన్ అనే ఇద్దరు నిందితులు ట్రాన్స్‌ జెండర్ కమ్యూనిటీలోని వివాదాన్ని కవర్ చేసే విలేఖరులమని చెప్పుకుంటూ బాధితురాలిని సంప్రదించారు. వారు ఆమె నుండి తొలుత డబ్బు డిమాండ్ చేశారు.. అనంతరం, మీడియాలో ఆమె పేరును దుష్ప్రచారం చేస్తామని బెదిరించారు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కేసు విచారణ చేసి నిందితులను అరెస్టు చేయాలని, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టు తిరిగిన స్పందించడం లేదని ట్రాన్స్ జెండర్లు ఆవేదనకు గురయ్యారు.

పోలీసుల వైఖరిని నిరసిస్తూ 24మంది ట్రాన్స్ జెండర్లు ఒక గదిలోకి వెళ్లి..ఫ్లోర్ క్లీనర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎంకే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇన్ చార్జ్ డాక్టర్ బసంత్ కుమార్ నింగ్వాల్ పర్యవేక్షణలో వారికి వైద్య చికిత్సలు అందించారు. . అందరి ఆరోగయ పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. అయితే ట్రాన్స్ జెండర్ల సామూహిక ఆత్మహత్యాయత్నం వార్త వ్యాపించడంతో.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్‌ జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కొందరు ఆసుపత్రి లోపల కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని వారి ప్రయత్నాలు విఫలం చేశారు. ట్రాన్స్ జెండర్ల డిమాండ్ మేరకు నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చి వారందరిని శాంతింపచేశారు.