IND vs AUS ODI : రేపటి నుంచే భారత్- ఆస్ట్రేలియా వన్డే పోరు

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి వన్డేకు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తర్వాత 5 మ్యాచ్‌ల T20 సిరీస్ ఉంటుంది.

IND  vs AUS ODI : రేపటి నుంచే భారత్- ఆస్ట్రేలియా వన్డే పోరు

న్యూఢిల్లీ : భారత్ అస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే పెర్త్ వేదికగా రేపు జరుగనుంది. అయితే తొలి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లుగా అస్ట్రేలియా వాతావారణ విభాగం అంచనా వేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్ లోభాగంగా మొదటి వన్డే: అక్టోబర్ 19 (పెర్త్), రెండవ వన్డే: అక్టోబర్ 23 (అడిలైడ్), మూడవ వన్డే: అక్టోబర్ 25 (సిడ్నీ)లో జరుగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు భారత సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.

ఐదు మ్యాచ్ ల టీ 20సిరీస్ షెడ్యూల్

ఆ తర్వాత భారత్- అస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతుంది. తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్‌, కాన్‌బెర్రా, రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌, మెల్‌బోర్న్‌, మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్‌ ఓవల్‌, హోబర్ట్‌ లో, నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్‌ పిప్పెన్‌ ఓవల్‌, గోల్డ్‌ కోస్ట్‌, ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్‌ లో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.