Cricket | క్రికెట్ గురించి ఆసక్తికర విషయాలు.. చాలా రూల్స్ మారాయి కానీ.. అది మాత్రం మారలేదు..!
Cricket | మన దేశంలో క్రికెట్( Cricket )అభిమానులు చాలా మందినే ఉన్నారు. ఐపీఎల్( IPL ) నుంచి మొదలుకుంటే అంతర్జాతీయ మ్యాచ్( International Cricket Match )ల వరకు ఏ ఒక్కటి వదలకుండా చూసే అభిమానులు ఉన్నారు. వన్డే మ్యాచ్‌లనే కాదు టెస్ట్ మ్యాచ్‌లను కూడా ఆసక్తిగా వీక్షించే వారు ఉన్నారు. మరి అలాంటి అభిమానులు.. క్రికెట్( Cricket ) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాల్సిందే.

Cricket | క్రికెట్.. ఈ పదం వింటే చాలు.. క్రికెట్( Cricket ) ప్రేక్షకులు ఎగిరి గంతేస్తారు. వన్డే, టెస్ట్, ఐపీఎల్( IPL ), వరల్డ్ కప్( World Cup ).. ఏ మ్యాచ్ అయినా సరే టీవీలకు అతుక్కుపోతుంటారు. వీలైతే క్రికెట్ స్టేడియాల్లో( Cricket Stadium ) వాలిపోతుంటారు. అభిమాన క్రికెటర్లు కసితీరా ఆడుతుంటే కేరింతలు కొడుతూ.. తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు క్రికెట్ లవర్స్( Cricket Lovers ). ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను ఇష్టపడే దేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రపంచ దేశాల్లో భారత్( Bharath ) కూడా ఒకటి. మరి క్రికెట్‌ను ఫాలో అయ్యేవారు ఆశ్చర్యపరిచే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాల్సిందే.
16వ శతాబ్దంలో పురుడు పోసుకున్న క్రికెట్..
క్రికెట్‌కు గొప్ప చరిత్రనే ఉంది. 500 ఏండ్ల కిందటే ఈ ఆట పుట్టింది. 16వ శతాబ్దంలో తొలిసారిగా ఇంగ్లండ్( England )లో ప్రారంభమైంది. క్రికెట్ ఆ దేశ జాతీయ క్రీడగా కూడా మారింది. మొత్తానికి 500 ఏండ్ల క్రితమే బాల్( Ball ), బ్యాట్( Bat ) పుట్టాయి. ఇంగ్లండ్‌లో ప్రారంభమైన క్రికెట్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. కొన్ని కోట్ల మంది అభిమానులు క్రికెట్‌ను ఫాలో అవుతున్నారు.
300 ఏండ్ల క్రితమే ఉమెన్స్ క్రికెట్..
ఉమెన్స్ క్రికెట్( Womens Cricket )కు కూడా సుదీర్ఘ చరిత్ర ఉంది. తొలి ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ కూడా ఇంగ్లండ్‌లోనే పురుడు పోసుకుంది. మొట్టమొదటి సారిగా 1745లో ఇంగ్లండ్‌లోని సర్రేలో ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్( Womens Cricket Match ) జరిగింది. అంటే దాదాపు 300 ఏండ్ల క్రితమే మహిళల క్రికెట్ మొదలైంది. ఇప్పటికీ క్రికెట్‌లో మహిళలు రాణిస్తున్నారు.
1844లో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్
ఇక మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్( International Cricket Match ).. 1844లో న్యూయార్క్( Newyork )లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో అమెరికా( America ) – కెనడా( Canada ) జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో కెనడా అమెరికాపై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో.. ఇండియా( India ), ఆస్ట్రేలియా( Australia ) వంటి ప్రసిద్ధ జట్లు మాత్రం పాల్గొనలేదు.
స్పోర్ట్స్ లీగ్‌లలో ఐపీఎల్‌కు 6వ స్థానం
వరల్డ్ కప్( World Cup ) తర్వాత అత్యధిక పాపులారిటీ సొంతం చేసుకున్నది ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL). ఐపీఎల్ ఇండియా వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పెంచేసుకుంది. ప్రజాదరణ పరంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్పోర్ట్స్ లీగ్‌లలో ఐపీఎల్ 6వ స్థానంలో నిలిచింది.
పిచ్ విషయంలో మారని నిబంధనలు..
ఇక క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఈ గేమ్‌లో అనేక రూల్స్ మారాయి. కాలానుగుణంగా కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. కానీ పిచ్( Pitch ) విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. క్రికెట్ ఆట ప్రారంభమైనప్పుడు ఉన్న 22 గజాల పిచ్‌నే ఇప్పటికీ కొనసాగుతోంది. పిచ్ పొడవు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు.
వరల్డ్ ఫేమస్ స్పోర్ట్
క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. సాకర్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా నిలిచింది. భారతదేశం, ఆస్ట్రేలియా, యూకేలో భారీగా అభిమానులు ఉన్నారు.