Dalit Boy | బాల్ ట‌చ్ చేశాడని.. ద‌ళితుడి వేళ్లు న‌రికేశారు..

Dalit Boy | ద‌ళితుల ప‌ట్ల అగ్ర కులాల ఆగ‌డాలు మితిమీరిపోతూనే ఉన్నాయి. ద‌ళిత బాలుడు బాల్‌ను టచ్ చేసిన పాపానికి.. అత‌ని మేన‌మామ వేళ్ల‌ను నరికేశారు. ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని ప‌ఠాన్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌ఠాన్ జిల్లా ప‌రిధిలోని క‌కోశి గ్రామంలో ఆదివారం అగ్ర కులాల‌కు చెందిన కొంద‌రు పిల్ల‌లు గ్రామంలోని స్కూల్ ప్లే గ్రౌండ్‌లో క్రికెట్ ఆడారు. అయితే క్రికెట్ గ్రౌండ్ స‌మీపంలో ఓ ద‌ళిత బాలుడు.. ఆ […]

Dalit Boy | బాల్ ట‌చ్ చేశాడని.. ద‌ళితుడి వేళ్లు న‌రికేశారు..

Dalit Boy | ద‌ళితుల ప‌ట్ల అగ్ర కులాల ఆగ‌డాలు మితిమీరిపోతూనే ఉన్నాయి. ద‌ళిత బాలుడు బాల్‌ను టచ్ చేసిన పాపానికి.. అత‌ని మేన‌మామ వేళ్ల‌ను నరికేశారు. ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని ప‌ఠాన్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌ఠాన్ జిల్లా ప‌రిధిలోని క‌కోశి గ్రామంలో ఆదివారం అగ్ర కులాల‌కు చెందిన కొంద‌రు పిల్ల‌లు గ్రామంలోని స్కూల్ ప్లే గ్రౌండ్‌లో క్రికెట్ ఆడారు. అయితే క్రికెట్ గ్రౌండ్ స‌మీపంలో ఓ ద‌ళిత బాలుడు.. ఆ బాల్‌ను ట‌చ్ చేశాడు. దీంతో అగ్ర వ‌ర్ణాల పిల్ల‌ల‌కు కోప‌మొచ్చింది. బాలుడిపై దాడి చేశారు. ఈ విష‌యాన్ని త‌న మేన‌మామ ధీర‌జ్ ప‌ర్మార్‌కు బాధిత పిల్లాడు చెప్పారు.

పిల్ల‌ల‌పై దాడులు స‌రికాద‌ని అగ్ర కులాల పిల్ల‌ల‌కు ధీర‌జ్ హెచ్చ‌రించాడు. ధీర‌జ్ అగ్ర‌కులాల‌ను హెచ్చ‌రించ‌డం వారికి న‌చ్చ‌లేదు. దీంతో అదే రోజు సాయంత్రం ఓ టీ షాపు వ‌ద్ద ఉన్న ధీర‌జ్‌, అత‌ని సోద‌రుడిపై ప‌దునైన ఆయుధాల‌తో అగ్ర కులస్తులు దాడి చేశారు. ధీర‌జ్ చేతి వేళ్ల‌ను న‌రికేశారు.
స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.