Karnataka | నెలలుగా జీతం రాక కర్ణాటక పంచాయితీ ఆఫీసు ముందే నీటి కార్మికుడు ఆత్మహత్య
27 నెలలుగా వేతనం రాక చామరాజనగర్‌లోని గ్రామపంచాయతీ నీటి కార్మికుడు కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపుల ఆరోపణలు, ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Karnataka Panchayat Worker Dies By Suicide Over 27-Month Unpaid Salary | SC/ST Case Filed | BJP Slams Govt
బెంగళూరు:
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో వేతనం రాక బాధపడుతున్న గ్రామపంచాయతీ నీటి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర్ తాలూకా హోంగనూరు గ్రామపంచాయతీలో పని చేస్తున్న చికూసా నాయక (42) పంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
2016 నుంచి అదే పంచాయతీలో పనిచేస్తున్నానని, 27 నెలలుగా జీతం ఇవ్వలేదని, దీనివల్ల మానసిక ఆందోళనకు గురయ్యానని ఆయన తన సుసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో రాజీనామా కూడా సమర్పించానని, అయితే అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆ లేఖలో రాశారు. తన వేతనం కోసం పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (PDO) రామే గౌడ, పంచాయతీ అధ్యక్షురాలి భర్త మోహన్‌కుమార్‌ను పలుమార్లు కోరినా పట్టించుకోలేదని, ఈ ఇద్దరూ మానసిక వేధింపులకు గురిచేశారని ఆయన నోట్‌లో పేర్కొన్నారు. “సెలవు అడిగితే బదులు మరోకరిని వెతుకు అని చెప్పేవారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆఫీసులో ఉండమని బలవంతం చేసేవారు. ఈ వేధింపుల వల్లే నేను ప్రాణాలు తీసుకుంటున్నాను,” అని ఆయన రాశారు.
SC/ST చట్టం కింద కేసు నమోదు
ఈ ఘటనపై పోలీసులు SC/ST అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. జిల్లా పంచాయతీ సీఈఓ PDO రామే గౌడను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో కలకలం రేగగా, అధికారులు నిర్లక్ష్యం చేశారని స్థానికులు , ఇతర ఉద్యోగులు ఆరోపించారు.
రాజకీయ విమర్శలు తీవ్రం
ఈ ఘటనపై ప్రభుత్వం మీద బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.
పార్టీ రాష్ట్ర నాయకులు స్పందిస్తూ — “రెండు రోజుల క్రితం కలబుర్గిలో ఒక లైబ్రేరియన్ వేతనం రాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మరో ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం,” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప సోషల్‌మీడియాలో రాసిన పోస్టులో —
“రూ.5,000 జీతం కూడా ఇవ్వలేని ప్రభుత్వం మానవత్వం కోల్పోయింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పాలనలో నిర్లక్ష్యం రోజురోజుకూ పెరుగుతోంది,” అని పేర్కొన్నారు.
వేతన బకాయిలపై రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి
కర్ణాటకలోని పలు జిల్లాల్లో పంచాయతీ స్థాయి ఉద్యోగులు నెలల తరబడి వేతనాలు పొందకపోవడం సాధారణంగా మారింది. శానిటేషన్, నీటి సరఫరా, కూలీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా ప్రాంతాల్లో 12 నెలల నుంచి 24 నెలల వరకు జీతాలు లేకుండా పనిచేస్తున్నారని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
సామాజిక సంస్థలు ఈ సంఘటనలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
A Karnataka waterman, Chikoosa Nayaka, died by suicide in front of a Panchayat office after not receiving his salary for 27 months. In his suicide note, he accused officials of mental harassment. A case was filed under the SC/ST Act, and the PDO was suspended. The BJP accused the Congress government of misgovernance and neglect of poor workers.