Baby Elephant Rejected By Mother | పాపం పిల్ల ఏనుగులు..తల్లి వద్దంది!

వరదల కారణంగా తల్లి నుంచి దూరమైన 15 రోజుల ఏనుగు పిల్లను అటవీ అధికారులు తల్లి వద్దకు చేర్చగా, అది దాన్ని తిరస్కరించింది. మరో ఘటనలో తల్లి నుంచి తప్పిపోయిన 7 రోజుల ఏనుగు పిల్లకు సీఎం మమతా బెనర్జీ 'లక్కీ' అని పేరు పెట్టారు.

Baby Elephant Rejected By Mother | పాపం పిల్ల ఏనుగులు..తల్లి వద్దంది!

విధాత : పాపం పిల్ల ఏనుగులు..రెండింటి కష్టాలు రెండురకాలు. ఒక పిల్ల ఏనుగును తల్లి వద్దు పొమ్మంటే..మరో పిల్ల ఏనుగు తల్లి నుంచి తప్పిపోయింది. వివరాల్లోకి వెళితే ఇటీవల వరదల సందర్భంగా ఓ ఏనుగు గుంపు నుంచి తల్లి ఏనుగు వద్ద నుంచి 15రోజుల పిల్ల ఏనుగు దూరమైంది. దానిని అటవీ అధికారులు సంరక్షించి తమ జంతు సహాయ శిబిరంలో సపర్యలు చేశారు. అది కోలుకున్నక తిరిగి అడవిలోని తల్లి ఏనుగు గుంపు వద్ద విడిచిపెట్టారు. చిత్రంగా ఆ తల్లి ఏనుగు తన కన్నబిడ్డయైన పిల్ల ఏనుగును అక్కున చేర్చుకోవడానికి నిరాకరించింది. దీంతో ఎన్నో ఆశలతో తల్లి ఏనుగు వద్దకు పరుగున వచ్చిన పిల్ల ఏనుగు రోధిస్తూ ఉండిపోయింది. దానిని పట్టించుకోకుండా తల్లి ఏనుగు తన గుంపుతో వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూసిన అటవీ సిబ్బంది సైతం ఛలించిపోయారు. తిరిగి పిల్ల ఏనుగును సహాయక శిబిరానికి తరలించారు. తల్లి ఏనుగులు తమకు కొన్నిరోజుల పాటు దూరమైన పిల్ల ఏనుగులను చాల అరుదుగా తిరస్కరిస్తుంటాయని..పాపం పిల్ల ఏనుగు తల్లిపై బెంగపెట్టుకుందని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అటవీ అధికారి ఫర్వీన్ కస్వాన్ ఎక్స్ లో పోస్టు చేయగా..అదికాస్తా వైరల్ అయ్యింది.

మరో ఘటనలో బెంగాల్ లో వరదల సందర్భంగా అడవిలో తల్లి ఏనుగుల గుంపు నుంచి తప్పిపోయిన 7 రోజుల వయసున్న పిల్ల ఏనుగును అక్కడి అటవీ అధికారులు సంరక్షించారు. దీనికి అటవీ అధికారుల వినతి మేరకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్కీ అని నామకరణం చేశారు. తల్లికి దూరమైన ఈ లక్కీ ఇప్పుడు అటవీ అధికారుల సంరక్షణలో జంతు సహాయ పునరావాస శిబిరంలో పెరుగుతుంది.