Pawan Kalyan | పవన్​ ఫ్యాన్స్​.. ఊపిరి బిగబట్టండి.. స్క్రీన్లు చిరిగిపోయే సినిమా వస్తోంది..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాన్ ఇండియా డైరెక్టర్ లోకేశ్​ కనగరాజ్ కలిసి కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో భారీ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

  • By: ADHARVA |    cinema |    Published on : Oct 18, 2025 9:00 AM IST
Pawan Kalyan | పవన్​ ఫ్యాన్స్​.. ఊపిరి బిగబట్టండి.. స్క్రీన్లు చిరిగిపోయే సినిమా వస్తోంది..!

Lokesh Kanagaraj and Pawan Kalyan to collaborate for a Pan-India film under KVN Productions

(విధాత వినోదం డెస్క్​)

హైదరాబాద్‌:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తూ, సినిమాలపై కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో, సినీ రంగంలో కూడా ఆయన ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో నిమగ్నమైన పవన్ కల్యాణ్, త్వరలోనే మరో పెద్ద ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారని సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను దక్షిణాదిలో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోందని సినీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

లోకేశ్​ కనగరాజ్ – పవన్ కల్యాణ్ కాంబో?

Lokesh Kanagaraj To Team Up With Pawan Kalyan For A Pan-India Film Under KVN Productions?

కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటికే పవన్ కల్యాణ్ కాల్​షీట్లు తీసిపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌కు పాన్ ఇండియా డైరెక్టర్ లోకేశ్​ కనగరాజ్ లేదా హెచ్. వినోద్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం లోకేశ్​ కనగరాజ్ ‘కూలీ’ చిత్రం పరాజయం తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ కోసం చూస్తుండగా, కేవీఎన్ సంస్థ ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే, ఈ కలయిక దక్షిణాదిలోనే కాదు, పాన్​ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తెచ్చే అవకాశం ఉంది. ఈ చిత్ర బడ్జెట్​ కూడా భారీస్థాయిలోనే ఉండబోతోందని తెలుస్తోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ లైన్‌అప్‌

కేవీఎన్ సంస్థ ప్రస్తుతం దళపతి విజయ్‌తో జన నాయకన్, యష్‌తో టాక్సిక్, చిరంజీవితో బాబీ దర్శకత్వంలో మరో సినిమా, అలాగే ధ్రువ సర్జా హీరోగా కేడీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌తో భారీ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీని వెనుక చిరంజీవి ఉన్నట్లుగా తెలుస్తోంది. పవన్​తో సినిమా ఒప్పించడానికి నిర్మాణ సంస్థ తమ హీరో, మెగాస్టార్​ను సంప్రదించగా ఆయన మాటసాయం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

పవన్ కల్యాణ్ : రాజకీయాలు & సినిమాలు – రెండూ సమాంతరంగా

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్, తన రాజకీయ బాధ్యతల మధ్యలో సినిమాలను కూడా కొనసాగిస్తానని స్పష్టంగా తెలిపారు. సినిమా నా బ్రెడ్ అండ్ బట్టర్ అని ఆయన చెప్పిన వ్యాఖ్య ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా, పవన్ కల్యాణ్ రాజకీయ, సినీ జీవితాల్లో మరో మైలురాయిగా నిలవనుందనే అంచనాలు ఉన్నాయి.

After the massive success of OG, Pawan Kalyan is reportedly in talks for another high-profile film under KVN Productions. Buzz suggests that renowned Tamil director Lokesh Kanagaraj might helm this Pan-India project. The banner, currently producing big films like Jana Nayakan with Vijay and Toxic with Yash, has already secured Pawan’s dates and plans to announce the project officially soon.

However, given Pawan Kalyan’s busy schedule as Andhra Pradesh Deputy CM and Lokesh’s recent setback with Coolie, the project may take time to materialise.