Lokesh Kanagaraj : హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్..జంటగా కూలీ భామ!

కూలీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా..! రచితా రామ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న లోకేష్.

Lokesh Kanagaraj : హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్..జంటగా కూలీ భామ!

Lokesh Kanagaraj | విధాత : హీరోలుగా మారిన దర్శకుల జాబితాలో మరో తమిళ దర్శకుడు చేరిపోయాడు. ఇటీవల తన డెబ్యూ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మూవీతో బాక్సాఫీస్ హిట్‌ సాధించి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు అభిషన్ జీవింత్ మెగాఫోన్ వదిలి హీరోగా మారిపోయాడు. సౌందర్య రజనీకాంత్‌ నిర్మాణ సారధ్యంలో అభిషన్ జీవింత్ -మలయాళ నటి అనశ్వర రాజన్‌ జంటగా మదన్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఇది ఇలా ఉండగానే కూలీ సినిమా డైరక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా హీరోగా మారిపోయాడు. లోకేష్ కనకరాజ్ హీరోగా కెప్టెన్ మిల్లర్ దర్శకుడు అరుణ్ మత్తేశ్వరన్ డైరెక్షన్ లో ఒక సినిమా మొదలైంది. ఈ సినిమాలో లోకేష్ యాక్షన్ హీరోగా కనిపిస్తాడని టాక్. ఈ సినిమా కోసం లోకేష్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడట. లోకేష్ కు జంటగా..కూలీ సినిమాలో కళ్యాణి రోల్ లో అదరగొట్టిన రచితా రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. లోకేష్, రచిత కాంబో ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

ముందుగా ఈ సినిమాలో లోకేష్ కు జంటగా ‘జైలర్‌’‌ సినిమాలో రజినీకాంత్‌కు కోడలి పాత్రలో కనిపించిన మిర్నామీనన్ ను తీసుకోవాలనుకున్నారు. చివరకు రచిత రామ్ ఆ ఛాన్స్ కొట్టేసింది. ఇకపోతే మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలతో కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్‌లోనూ మంచి దర్శకుడిగా బిగ్ క్రేజ్ దక్కించుకున్నాడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఖైదీ 2 సినిమాతో పాటు కమల్, రజనీ మల్టీస్టారర్ కూడా లోకేష్ దర్శకత్వ జాబితాలో ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు దర్శకుడిగా, అటు హీరోగా రెండు విభిన్న బాధ్యతలను నిర్వర్తించడంతో లోకేష్ కనకరాజ్ ఎంతమేరకు విజయవంతమవుతాడన్నది వేచి చూడాలి.