Movie Ticket Hike| తెలంగాణలో కూలీ, వార్-2 సినిమాల టికెట్ ధరల పెంపుపై రచ్చ..?

Movie Ticket Hike| తెలంగాణలో కూలీ, వార్-2 సినిమాల టికెట్ ధరల పెంపుపై రచ్చ..?

విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రా(Telugu states)ల్లో సినిమా టికెట్ల ధరల పెంపు(Movie Ticket Price Hike)కు హద్దు..అదుపు లేకుండా పోతుందన్న ఆగ్రహం ప్రేక్షకు(Audience protest)ల్లో వ్యక్తమవుతుంది. చిత్రంగా ఒకటే సినిమాకు రెండు రాష్ట్రాల్లో వేర్వేరు టికెట్ రేట్లు నిర్ణయించడం విమర్శలకు గురవుతుంది. రజనీకాంత్ నటించిన తమిళ్ సినిమా కూలి(Coolie movie)కి చెన్నై మల్టీఫ్లెక్స్‌లో టికెట్ రేట్ – రూ.183 రూపాయలు ఉండగా..అదే కూలి సినిమాకు హైదరాబాద్ మల్టీఫ్లెక్స్‌లో టికెట్ రేట్ – రూ.453గా నిర్ణయించడం విడ్డూరం. మల్టీప్లెక్స్ రిక్లైనర్ లో రూ. 530, నార్మల్ థియేటర్ లో 415గా కొనసాగుతుంది. వార్ 2 సినిమా(War 2 ticket) టికెట్ రేటు మల్టిఫ్లెక్స్ లో రూ.415కు విక్రయిస్తున్నారు. కూలి చిత్రానికి సింగిల్ స్క్రీన్ రేట్లు రూ.200 ఉండగా, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2కు హిందీ వెర్షన్ కు రూ.250 టికెట్ ధరను నిర్ణయించిన‌ట్టు తెలుస్తుంది. తెలుగు వార్ 2 వర్షన్ కు రూ.400గా నిర్ణయించారు. హింది వార్ 2 వర్షన్ కు రూ.250గా నిర్ణయించారని సమాచారం.

ఈ రెండు సినిమాలపై ఉన్న క్రేజ్‌ని నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారని..సాధారణ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారంటూ నెట్టింట్లో తీవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ 2 సినిమాను తెలుగులో సితార నాగవంశీ సుమారు రూ. 90 కోట్లకు కొనుగోలు చేసారు. మరోవైపు రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాను రూ. 45 కోట్లకు కొన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మేము అంత పెట్టి కొన్నాం మాకు టికెట్స్ రేట్లు పెంచండి అని జీవోలు తెచ్చుకుని ప్రేక్షకులను దోచుకుంటున్నారని..ఇందుకు ప్రభుత్వాలు సహకరించడం బాగాలేందంటున్నారు నెటిజన్లు.