MSVPG Collections 5 days | మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల దుమ్మురేపారు – ఐదు రోజుల్లో ₹150 కోట్లు
సంక్రాంతి సెలవులను రఫ్ఫాడిస్తూ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఐదు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ను దాటింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ఫ్యామిలీ ఎంటర్టైనర్ భారీ పాజిటివ్ మౌత్ పబ్లిసిటీతో బాక్సాఫీస్‌ను కుదిపేసింది. చిరంజీవి గత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టే దిశగా 'మన శంకర వర ప్రసాద్ గారు' పయనిస్తోంది.
Mana Shankara Vara Prasad Garu Box Office: Chiranjeevi Smashes ₹150 Cr Gross, Dominates Sankranthi Race
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
MSVPG Collections 5 days | మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి పండుగ రేసులో అప్రతిహతంగా దూసుకుపోతూ ఐదో రోజుకే దేశవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్, రూ.100 కోట్ల నెట్ మార్క్‌ను అధిగమించింది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి భారీగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నారని బాక్సాఫీస్ నెంబర్లు స్పష్టంగా చెబుతున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్–ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు మొదటి రోజు నుంచే అసాధారణ స్పందన లభించడంతో కలెక్షన్లు వరుసగా పెరుగుతూ వచ్చాయి.
సంక్రాంతి సంబరాల నాలుగో రోజు వచ్చిన ఈ భారీ చిత్రానికి సెలవులు మరింత ఊపునిచ్చాయి. Sacnilk అంచనాల ప్రకారం, ఐదోరోజు (జనవరి 16, శుక్రవారం) మన శంకర వర ప్రసాద్ గారు భారత్‌లో సుమారు ₹2.61 కోట్లు సంపాదించి మొత్తం నెట్‌ను ₹104.46 కోట్లకు చేర్చింది. మొదటి ఐదు రోజుల తెలుగు సినీ మార్కెట్ ధాటిని పరిశీలిస్తే, చిరంజీవి సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు, అభిమానం ఇంకా తగ్గలేదని స్పష్టమవుతుంది.
దేశవ్యాప్త రన్ – ఐదు రోజుల్లో ₹100 కోట్ల వసూళ్లు దాటిన మెగాస్టార్
ఓ సారి ఈ చిత్రం రోజువారీ కలెక్షన్లను పరిశీలిస్తే—
- ప్రీమియర్లు ( ఆదివారం): ₹9.35 కోట్లు
- మొదటి రోజు (సోమవారం విడుదల): ₹32.25 కోట్లు
- రెండో రోజు (మంగళవారం): ₹18.75 కోట్లు
- మూడో రోజు (బుధవారం – భోగి): ₹19.50 కోట్లు
- నాలుగో రోజు (గురువారం – సంక్రాంతి): ₹22 కోట్లు
- ఐదవ రోజు (శుక్రవారం – కనుమ): ₹2.61 కోట్లు ..ఇంకా ఉంది
- 5 రోజుల మొత్తం నెట్ కలెక్షన్లు : ₹104.46 కోట్లు భారత్
ఈ సంఖ్యలను చూస్తే నాలుగు రోజుల వరకూ అద్భుత స్థాయిలో కొనసాగిన దూకుడు, ఐదో రోజు కూడా గణనీయ స్థాయిలో కొనసాగనుందని చెప్పొచ్చు.
ప్రత్యేకించి నైజాం ప్రాంతంలో చిత్రం కలెక్షన్ల తుపాను సృష్టించింది. చిరంజీవికి పెట్టని కోటగా ఉండే ఈ ప్రాంతం, నాలుగో రోజుకే ₹5.5 కోట్ల షేర్ రాబట్టి మొత్తం నైజాం షేర్‌ను ₹21 కోట్లు దాటించింది. ఇదే వేగం కొనసాగితే వారం చివరి వరకు రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: కలెక్షన్ల వర్షంతో తడిసి ముద్దయిపోతున్న మెగాస్టార్
ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్ల గ్రాస్‌తో ‘రాజాసాబ్’ను ఢీకొట్టిన ప్రసాద్‌గారు

ఓవర్సీస్ మార్కెట్లోను మన శంకర వర ప్రసాద్ గారుకి అద్భుత స్పందన లభిస్తోంది. విడుదలైన మూడు రోజులకే చిత్రం $2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. నాలుగో రోజు కల్లా వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్లు ₹150 కోట్లపైగా చేరుకోవడం విశేషం.
ఇదే సమయంలో విడుదలైన ప్రబాస్ చిత్రమైన ది రాజాసాబ్ భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ, సినిమా బాగాలేదనే పేరు రావడంతో వారం మధ్యలోనే దారుణంగా పడిపోయింది. దీనివల్ల చిరు సినిమా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్లు దక్కించుకుంది. సెలవు రోజుల రెండింటిలోను మన శంకర వర ప్రసాద్ గారు సంపాదించిన ₹43 కోట్ల దేశీయ గ్రాస్, రాజాసాబ్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. బుక్‌మైషోలో కూడా చిత్రం అసాధారణ ఆదరణ చూస్తోంది. నాలుగో రోజు వరకు 44,09,000 టికెట్లు అమ్ముడవడం, అంటే.. సగటున పూటకు 25 వేల టికెట్ల విక్రయం, సినిమాపై ఉన్న భారీ డిమాండ్‌ను సూచిస్తోంది. చాలా కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు మామూలు దృశ్యంగా మారాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram