MSG | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి .. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో రికార్డ్ ఓపెనింగ్స్
MSG |మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన బాక్సాఫీస్ పవర్‌ను నిరూపించుకున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన చిరు సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి సీజన్‌లో సెన్సేషన్‌గా మారింది.
MSG |మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన బాక్సాఫీస్ పవర్‌ను నిరూపించుకున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన చిరు సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి సీజన్‌లో సెన్సేషన్‌గా మారింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, ‘వింటేజ్ చిరంజీవి’ని చూడాలనే అభిమానుల కోరిక థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టిస్తోంది.
రికార్డ్ స్థాయి ఓపెనింగ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలై తొలిరోజే సంచలన వసూళ్లను నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా భారత్‌లో తొలి రోజు రూ. 28.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.అంతేకాదు, జనవరి 11న నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా వచ్చిన రూ. 8.75 కోట్లు కలిపితే… దేశీయంగా తొలి రోజు మొత్తం రూ. 37.50 కోట్ల నెట్ (రూ. 44.75 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ నమోదయ్యాయి.
ఓవర్సీస్‌లోనూ చిరు హవా
విదేశీ మార్కెట్లలోనూ మెగాస్టార్ ప్రభంజనం కొనసాగింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం సుమారు 2.3 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 65.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభం సాధించింది. ఇది చిరంజీవి కెరీర్‌లో 2019లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత అత్యుత్తమ ఓపెనింగ్‌గా నిలిచింది.
నిర్మాతల క్లెయిమ్: మరింత భారీ సంఖ్యలు
ఇదే సమయంలో, చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం… ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరల్డ్‌వైడ్‌గా తొలి రోజే రూ. 84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే, చిరంజీవి సినిమా తన మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రైజ్’ తొలి రోజు కలెక్షన్స్ (రూ. 62.50 కోట్లు)ను దాటేసినట్లుగా తెలుస్తోంది. అలాగే, పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ (రూ. 57.80 కోట్లు), హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గదర్ 2’ (రూ. 53.20 కోట్లు) తొలి రోజు వసూళ్లను కూడా చిరంజీవి సినిమా వెనక్కి నెట్టేసిందనే చర్చ జరుగుతోంది.
రెండో రోజూ తగ్గని జోరు
రెండో రోజు కూడా ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్స్ బలంగా కొనసాగాయి. ట్రేడ్ ట్రాకర్ సక్నిల్క్ వెల్లడించిన వివరాల ప్రకారం… రెండో రోజు ఇండియాలో రూ. 15.56 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. దీంతో దేశీయంగా రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 53.06 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ భారీ ఓపెనింగ్ తర్వాత కాస్త నెమ్మదించడంతో, సంక్రాంతి రేసులో చిరంజీవి సినిమా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
స్టార్ క్యాస్టింగ్ ప్రత్యేక ఆకర్షణ
అనిల్ రావిపూడి మార్కు కామెడీ, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరిశారు. వెంకటేష్ ఎంట్రీకి థియేటర్లలో అభిమానుల నుంచి అదనపు స్పందన వస్తుండటం సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. మొత్తానికి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారని, సంక్రాంతి బాక్సాఫీస్‌ను తనదైన శైలిలో ఏలుతున్నారని ట్రేడ్ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram